News and Entertainment

భారీ రికార్డులతో భ్రహ్మోత్సవం



ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ’బ్రహ్మోత్సవం’ మూవీ త్వరలోనే రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మార్కెట్లోకి రిలీజ్ అయిన ’బ్రహ్మోత్సవం’ ఆడియో పై..అంచనాలు పెరుగుతున్నాయి. అలాగే రిలీజ్ రోజు దగ్గర పడుతుండటంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి మొదటి వారం రోజులు కీలకంగా మారనున్నాయి. అంటే మొదటి 7 రోజుల్లోనే ఈ మూవీ భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోవాలన్నది టార్గెట్ గా కనిపిస్తుంది.


మూవీకి పెట్టింది 55 కోట్ల రూపాయలు అయితే, కలెక్షన్స్ వంద కోట్ల రూపాయలుగా టార్గెట్ కనిపిస్తుంది. దీంతో ’బ్రహ్మోత్సవం’ మూవీని మ్యాగ్జిమం ఎక్కువ థియోటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డొమెస్టిక్, ఓవర్సీస్ లోనూ ఈ మూవీని భారీ సంఖ్యలో రిలీజ్ చేయనున్నారు. ఓ రకంగా చూస్తే...గతంలో మహేష్ నటించిన మూవీల కంటే ఇప్పుడు ’బ్రహ్మోత్సవం’ మూవీ భారీ సంఖ్యలో రిలీజ్ అవుతుంది.



ఇది మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక సంఖ్యలో రిలీజ్ అయిన చిత్రంగా ’బ్రహ్మోత్సవం’ నిలవనుందని అంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో 24 థియేటర్లలో విడుదల అవుతున్నది. ’బ్రహ్మోత్సవం’ మూవీలో మహేష్ బాబు సైతం ఇన్వెస్ట్ చేయటంతో ఈ మూవీ కచ్ఛితంగా అందరికి లాభాలను చేకూర్చాలనే పాయింట్ లో మహేష్ మూవీకి సంబంధించిన బిజినెస్ ని చేసుకుంటున్నాడు.


’బ్రహ్మోత్సవం’ మూవీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. ’బ్రహ్మోత్సవం’ మూవీపై మహేష్ తీసుకుంటున్న కేరింగ్ చూసుకుంటే ఈ మూవీ కచ్చితంగా సంచలన రికార్డ్ ని కూడ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.



loading...