News and Entertainment

బ్రహ్మోత్సవం పై సెలబ్రిటీస్ కామెంట్స్


చక్కటి కుటుంబ కథా చిత్రంతో వచ్చిన బ్రహ్మోత్సవం మూవీ...నేడు థియోటర్స్ లో ప్రదర్శన జరుపుకుంటుంది. మంచి కుటుంబ విలువలతో సాగే చిత్రం..ప్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కుంటుంబసమేతంగా చూడదగ్గ చిత్రంగా బ్రహ్మోత్సవం చిత్రం ప్రేక్షక ఆధరణ కలిగి ఉంటుంది. అయితే బయటకు మాత్రం బ్రహ్మోత్సవం మూవీపై భారీగా నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ..స్వయంగా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలే బ్రహ్మోత్సవం మూవీపై కామెంట్ చేయటం హాట్ టాక్స్ ని క్రియేట్ చేస్తుంది.

దీనికి సంబంధించని వివరాల్లోకి వెళితే, ఇప్పటికే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ...మహేష్ బాబుపై ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేశాడు. మహేష్ లాంటి స్టార్ కుటుంబ కథా చిత్రాల జోలికి వెళ్ళకుడదని, ఒకవేళ వెళ్ళినా..ఈ తరహా కథలను చేయకూడదని చెప్పుకొచ్చాడు. బజినెస్ మెన్, ఒక్కడు, దూకుడు వంటి చిత్రాలను చేయాలని క్లియర్ గా కామెంట్ చేశాడు. అఫిషియల్ గా ఇలా కామెంట్ చేసింది వర్మ అయితే...పైకి కనిపించకుండా కామెంట్ చేసిన సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారంట.


వారిలో ప్రముఖ స్టార్ హీరో...శ్రీకాంత్ అడ్డాల వంటి యంగ్ డైరెక్టర్ కి అప్పుడే ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు ఇవ్వటం కరెక్ట్ కాదని.. ఈ విషయంలో మహేష్ దే తప్పని చెప్పుకొచ్చాడు. అలాగే మహేష్ బాబు క్లోజ్ ప్రెండ్ అయిన ఇండస్ట్రీ హీరో...మహేష్ బాబు పూర్తి కమర్షియల్ చిత్రాల్లో నటిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే చాలా మంది టెక్నిషయన్స్ సైతం బ్రహ్మోత్సవం లాంటి కుటుంబ కథలకి కథనం ముఖ్యం. కథ ఉంటే సరిపోదు. శ్రీకాంత్ అడ్డాల ఆ పని సరిగా చేయలేకపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా మహేష్ బాబు పై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలు నేడు కామెంట్స్ చేస్తున్నారనే టాక్స్ బాహాటంగానే వస్తున్నాయి.





loading...