News and Entertainment

రాజమౌళి సీక్రెట్ ను బయట పెట్టేసిన చోటా కె. నాయుడు !



టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి పేరు గాంచిన సినిమాటోగ్రాఫర్ లలో చోటా కె. నాయుడుది ఒక ప్రముఖ స్థానం. ఎందరో టాప్ హీరోల సినిమాలకు టాప్ దర్శకులతో పనిచేసిన నాయుడు ఫోతోగ్రాఫీని మెచ్చుకొని వారుండరు. అటువంటి టాప్ కెమెరా మేన్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. ఎందరో టాప్ దర్శకులతో పనిచేసిన తాను టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో పనిచేయలేకపోవడానికి గల కారణాన్ని బయట పెట్టాడు.

తాను ఎందరో అగ్ర దర్శకులతో పనిచేసినా తనకు రాజమౌళితో పనిచేయలేదు అన్న అసంతృప్తి ఉంది అంటూ రాజమౌళితో తనకు పనిచేసే అవకాశం వచ్చి చివరి నిముషంలో మిస్ అయిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు చోటా. రాజమౌళి ‘మర్యాదరామన్న’ సినిమా ప్రారంభించే ముందు తన దగ్గరకు వచ్చి ‘మర్యాదరామన్న’ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయమని ఆఫర్ ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో ఆఫర్ వచ్చినందుకు తాను పొంగిపోయాను అని అంటున్నాడు చోటా.

‘మర్యాదరామన్న’ షూటింగ్ ప్రారంభానికి ముందు లోకేషన్స్ ఎంపిక చేయడానికి తాను రాజమౌళితో కలిసి వెళ్ళినప్పుడు రాజమౌళి తన పట్ల చూపించిన అభిమానం గౌరవం తాను ఎప్పుడూ మరిచిపోలేను అని అంటూ ఆజ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. ఆ  ట్రిప్ లో తనకు ఏమి కావాలో అన్నీ దగ్గర ఉండి చూసుకున్న రాజమౌళి చూసినప్పుడు ‘మగధీర’ లాంటి బ్లాక్ బస్టర్ కు దర్శకత్వం వహించింది రాజమౌళి యేనా అన్న అనుమానం కలిగిందని చోటా రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

అంతేకాదు టాలీవుడ్ సినిమా రంగంలోనే కాదు దక్షిణ భారత సినిమా రంగంలో రాజమౌళి లాంటి నిరాడంబర వ్యక్తిత్వం గల వ్యక్తులను తాను చూడలేదు అని అంటూ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు చోటా. టాప్ హీరోలు రజినీకాంత్ సూర్యా లాంటి వ్యక్తులు రాజమౌళిని తమకు ఒక అవకాశం ఇమ్మని అడుగుతున్న నేపధ్యంలో చోటా కె. నాయుడు కూడ అదే పద్ధతిని అనుసరిస్తూ రాజమౌళిని పొగడటం ద్వారా కనీసం అతడు తీయబోయే తదుపరి సినిమాలలో అయినా చాన్స్ కోసం చోటా రాజమౌళిని కాకా పడుతున్నాడు అనుకోవాలి.. 


చత్రపతి శివాజి  రాజమౌళి మూవీ  

loading...