News and Entertainment

మొరాకోలో 'గౌతమిపుత్ర శాతకర్ణి'



నందమూరి బాలకృష్ణ తన వందవ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తీసుకున్నారు ..ఈ క్రమంలోనే జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్‌), బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఇటీవల ఈ చిత్రం ప్రారంభోత్సవం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మే 9న మొరాకోలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ సహకారంతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ  మొరాకోలో మూడు వారాల పాటు చిత్రీకరణ జరుపుతాం.

ఈ చిత్రం ఆనాటి ఆంధ్ర మహారాజులు పరిపాలన కాలం నాటి చిత్రానికి సంబంధించి  కథ కావడంతో ప్రేక్షకులను ఆ కాలానికి తీసుకువెళ్లడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించడం కోసం భారీ సెట్లు .. భారీ ఖర్చు .. ఎక్కువ సమయం అవసరమవుతాయి.  అందుకోసం అలనాటి చారిత్రక నేపథ్యానికి కాస్త దగ్గరగా వుండే మొరాకోలో ఈ సినిమా షూటింగ్ చేయాలని క్రిష్ భావించాడు. అందుకే మొరాకోలో చిత్రీకరణను ప్లాన్ చేశారు.



రామ్ - లక్ష్మన్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను అక్కడ ప్లాన్ చేయడం జరిగిందని అన్నాడు. హాలీవుడ్ టెక్నిషియన్స్ సహకారంతో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా మొదటి రోజు పూర్తయ్యింది.  బాలకృష్ణగారు, కబీర్ బేడిగారు తదితరులు ఈ షెడ్యూల్ లో ఉత్సాహంతో పాలు పంచుకున్నారు. తొలిరోజు సన్నివేశాలు అనుకున్న దానికంటే బాగా రావడంతో చాలా హ్యపీగా ఉన్నాం’’అన్నారు.  నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.


కత్తిలాంటి ఫిగర్ ని పట్టేసిన మెగాహీరో  
ఆడవాళ్ళు అక్రమసంబంధాలు పెట్టుకోవడానికి 6 కారణాలు ! 

సెక్స్: పడకపై ఆమె అదిరిపోవాలంటే  


loading...