News and Entertainment

మెగా అభిమానులకి ఇక పండగే



తెలుగు ఇండస్ట్రీకి దాదాపు పది సంవత్సరాలు గా దూరం ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి తన 150 చిత్రం గురించి మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శంకర్ దాద జిందాబాద్ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి వెండితెరపై కనిపించాలని తన 150 వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని చూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్నా చిరు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న చిరు 150వ మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కేసింది. రీసెంట్‌గా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాగా.. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే మెగాస్టార్ కథా కథనాలను ఫైనల్ చేశారు చిత్ర యూనిట్...అంతే కాదు  శుక్రవారం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తూ.. చిరుతో దిగిన సెల్పీ ఫోటోను సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇక మెగా ఫ్యామిలీకి బాగా దగ్గర ఉండే రాక్ స్టార్ దేవి శ్రీ మరోసారి చిరు చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నారు.


తాజాగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్  సెల్పీ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దేవి ఈ ఫోటోతోపాటు ‘విత్ ది బాస్ మెగాస్టార్… 150వ సినిమా తొలి రోజు డిస్కషన్స్, వెల్ కం బ్యాక్ సర్’ అంటూ ట్వీట్ చేశాడు. దేవి ట్వీట్‌ని బట్టి చూస్తే.. ఈ సినిమా పనులు చకచకా తెరవెనుకే జరుగుతున్నట్లు అర్థమవుతోంది. 
loading...