News and Entertainment

ఎన్టీఆర్ - పూరీ ప్రాజెక్ట్ “నేతాజీ”


సెన్సేషనల్ దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రస్తుతం సెట్స్ పైనున్న “రోగ్” సినిమాను పూర్తి చేసి, ఈ నెల 25వ తేదీ నుండి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు. సినిమాను ఖచ్చితంగా మూడు నెలల్లో పూర్తి చేసే పూరీ, ఈ సినిమాను ఈ ఏడాది సెకండాఫ్ విడుదలకు ఎక్కుపెట్టాడు. ఇక, ఇటీవలే “జనగణమన” పేరుతో ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక సినిమాకు పూరీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 


ఇలా తెలుగు ప్రాజెక్ట్ లు కాకుండా ఒక బాలీవుడ్ సినిమాను బిగ్ బీతో కూడా చేసేందుకు పూరీ అమితాబ్ నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు. ఇంత టైట్ షెడ్యూల్ లో మరో సినిమాకు పూరీ సిద్ధమవుతున్నారని మీడియా వర్గాల టాక్. 


జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్లో “నేతాజీ” అనే సినిమా రూపుదిద్దుకోబోతున్నట్లుగా ప్రముఖ మీడియా ఛానల్ సంచలన కధనం ప్రసారం చేసింది. ఏ విషయమైనా ముందుగా సోషల్ మీడియాలో సందేశం పంపించే పూరీ, ‘నేతాజీ’ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా బయటకు పొక్కిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 


ఈ ప్రాజెక్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ నెల 20వ తేదీన పూరీ తెలియజేస్తారని పేర్కొన్న సమాచారంలో వాస్తవం తెలియాలంటే మరో 10 రోజులు వేచిచూడాలి. అయితే ‘నేతాజీ’ టైటిల్ అదిరిపోయింది అంటున్నారు ‘బుడ్డోడు’ అభిమానులు.

loading...