News and Entertainment

వెంకి చిత్రంలో ఎన్టీఆర్ మరోసారి హంగామా


తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసులుగా వస్తున్న సమయంలో ప్రముఖ ప్రొడ్యూసర్ డి రామానాయుడు వారసుడిగా వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ కామెడీ, యాక్షన్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.  అయితే గత కొంత కాలంగా వెంకి నటించిన సినిమాలే పెద్దగా విజయం సాధించలేకపోయాయి..ఈ సమయంలో దృశ్యం, గోపాల గోపాల చిత్రాలతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. చాలా గ్యాప్ తీసుకున్న వెంకటేష్ కామెడీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం టాకీ భాగం చిత్రీకరణ ఇటీవలే పూర్తి చేసుకుని యూర‌ప్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జరుపుకోవడానికి వెళ్ళింది. జూలైలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ ఉంది..అదే జూనియర్ ఎన్టీఆర్. నిజమే ‘బాబు బంగారం’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేయబోతున్నాడట.



గ‌తంలో కూడా వెంకటేష్ న‌టించిన 'చింత‌కాయ‌ల ర‌వి' చిత్రంలోని ఓ పాట‌లో ఎన్టీఆర్‌-వెంకీ క‌లిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. గతంలో పవన్ కళ్యాన్ తో గోపాల గోపాల చిత్రంలో మల్టీ స్టారర్ చిత్రం అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వెంకి చిత్రంలో ఎన్టీఆర్ హాంగామా చేస్తున్న విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అవుతున్నారట.



భలే భలే మగాడివోయ్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న మారుతి వెంటనే విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సినిమా విజయం సాదిస్తే మారుతీ రేంజ్ ఎక్కడికో వెళ్తుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నారు. 
loading...