News and Entertainment

బ్ర‌హ్మోత్స‌వం డైలాగ్స్ ఇవే !



శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం మూవీ మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల దృష్ట్యా బ్ర‌హ్మోత్స‌వం బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జ‌రుగుతోంది. బ్ర‌హ్మోత్స‌వం థియేట్రిక‌ల్ రైట్సే రూ.90 కోట్ల‌కు అమ్ముడైన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన బ్ర‌హ్మోత్స‌వం సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యూ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న బ్ర‌హ్మోత్స‌వం డైలాగులు చూస్తుంటే సినిమాలో కుటుంబ బంధాలు -అనుబంధాల‌కు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థ‌మ‌వుతోంది. లీక్ అయిన బ్ర‌హ్మోత్స‌వం డైలాగులు ఇలా ఉన్నాయి.


ఇది కూడా చదవండి: మన హీరోల ఆస్తుల్లో టాప్-5 ఎవరు?  


1. నలుగురిలో ఉండటం అంటే..నీ ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండటం కాదు. నలుగురూ నిన్ను గుర్తించడం..
2. మంచితనం నీ పుట్టుమచ్చ అయితే..దొంగతనం, చెడ్డతనం నువ్వు పెట్టుకున్న మచ్చలు. ఏ మచ్చలు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో..
3. సమస్యలు అలలు లాంటివి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయ్. నువ్వు తీరంలా ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండాలి.
4. సముద్రంలో నీరు, అసమర్థుడి దగ్గర డబ్బు ఎంత ఉన్నా ప్రయోజనం ఉండదు..
5. ఫ్యామిలీ ప్రాణం లాంటిది. జాగ్రత్తగాచూసుకోవాలే గానీ, ఎక్కడ పడితే అక్కడ మధ్యలో వదిలేయకూడదు.

ఇది కూడా చదవండి: 

విస్కీ తాగడం వల్ల 10 మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్  

loading...