News and Entertainment

బ్ర‌హ్మోత్స‌వం ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌



తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. వచ్చిన కొత్తలో పెద్దగా విజయవంతమైన చిత్రాలు లేకున్నా పోకిరి చిత్రంతో అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాల రికార్డులు బద్దలు కొట్టారు.

తర్వాత వచ్చిన దూకుడు సినిమాతో మరింత దూకుడు పెంచారు. గత సంవత్సరం శ్రీమంతుడు చిత్రంతో సోషల్ మెసేజ్ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం నిన్న ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయ్యింది.


ఈ చిత్రంపై మిశ్రమ స్పందనే వచ్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకున్న ఎలిమెంట్స్ ఏవీ లేకపోవడంతో బాగా నిరాశకు లోనయ్యారు. అంతే కాదు ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల చెప్పాల్సిన థీమ్ ఎవ్వరికీ అర్ధం కాలేదట. సినిమా మొత్తం హీరో గారి బంధువుల చుట్టూ తిరగడమే ఉందట. దీంతో అనుకున్న స్థాయిలో ఈ చిత్రం ఆడలేకపోయింది.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్, సమంత, ప్రణీత నటించారు. ఇక సినిమా మొత్తం పెద్ద తారలతో నిండిపోయి సందడిగా ఉందట. మిక్కీజే మేయర్ సంగీతం పెద్దగా ఆదుకోలేక పోయిందని టాక్. ఏది ఏమైనా మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేస్తాడని ఊహించిన వారికి నిరాశే మిగిలిందట.


బ్రహ్మోత్సవం ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్లు :

నైజాం : 3.67 కోట్లు

సీడెడ్ : 1.50 కోట్లు

గుంటూరు : 1.90 కోట్లు

వెస్ట్ : 1.92 కోట్లు

ఈస్ట్ : 1.60 కోట్లు

కృష్ణ : 0.75 కోట్లు

నెల్లూరు : 0.45 కోట్లు

వైజాగ్ : 0.96 కోట్లు

మొత్తం : 12.75 కోట్లు
loading...