News and Entertainment

మహేష్ మాటలకు మెగా హీరోలు షాక్



మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాను మహేష్ కనీవినీ ఎరుగని రీతిలో ప్రమోట్ చేస్తున్నాడు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం మహేష్ ఇంటర్వ్యూను అడిగిన ప్రతి ఛానల్ కు అలాగే ప్రతి పత్రికకు కాదన కుండా మహేష్ ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక విషయాల పై చాల ఓపికగా సమాధానాలు ఇస్తున్నాడు. 

ఈ సమాధానాలు ఇచ్చే విషయంలో మహేష్ ఎటువంటి ఇగోను ప్రదర్శించకుండా తన మనసులోని అభిప్రాయాలను చాల సూటిగా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధి మహేష్ ను ప్రస్తుత తరం హీరోలలో మీకు బాగా నచ్చిన డాన్సర్ ఎవరు ? అని అడిగినప్పుడు మహేష్ ఒక్క క్షణం కూడ ఆలోచించకుండా తనకు జూనియర్ ఎన్టీఆర్ వేసే స్టెప్స్ అంటే చాల ఇష్టమని చాల స్పష్టమైన సమాధానం ఇచ్చాడు.


దీనితో మహేష్ బాబు మెగా హీరోలకు ఝలక్ ఇచ్చాడు అంటూ ప్రచారం ప్రారంభం అయింది. మెగా ఫ్యామిలీలో ఒక్క పవన్ కల్యాణ్ మినహా చిరంజీవి నుండి సాయి ధరమ్ తేజ్ వరకు మంచి డాన్సర్స్ గా పేరు తెచ్చుకున్న నేపధ్యంలో మహేష్ కు మెగా కుటుంబంలోని టాప్ హీరోలు రామ్ చరణ్ అల్లుఅర్జున్ లు వేసే స్టెప్స్ గుర్తుకు రాలేదా అంటూ కొందరు మెగా అభిమానులు మహేష్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ప్రమోషన్ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడ తనకు టాలీవుడ్ యంగ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల డాన్సులు అంటే తనకు చాల ఇష్టం అంటూ కామెంట్ చేసాడు. 

లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ సమంత కూడ తనకు జూనియర్ తో స్టెప్స్ వేయాలి అంటే దడ అంటూ  కామెంట్స్ చేసింది. ఇలా అందరూ జూనియర్ భజన చేస్తూ ఉంటే మెగా కాంపౌండ్ లోని మెగా హీరోలను పట్టించుకునే వారు ఎవరు అనే కోపంతో మెగా హీరోల అభిమానులు మహేష్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.. 
loading...