News and Entertainment

బయటకొస్తున్న పవన్ అగ్రిమెంట్ వివరాలు ?



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత సాహసం అయినా చేస్తాడు అని పవన్ వ్యక్తిత్యాన్ని దగ్గర నుంచి చూసిన చాలా మంది సన్నిహితులు చెపుతూ ఉంటారు. ఈనేపధ్యంలో పవన్ నిర్మాత ఎ. ఎమ్. రత్నంకు ఇచ్చిన మాటకోసం ఎప్పుడులేని విధంగా ఒక సాహసం చేయబోతున్నాడు అని ఫిలింనగర్ లో వార్తల హడావిడి జరుగుతోంది. 

పవన్ కళ్యాణ్ కెరియర్ ను ఒక మలుపు తిప్పిన ‘ఖుషి’ సినిమాను ఎ.ఎమ్ రత్నం నిర్మించిన దగ్గర నుండి ఈనిర్మాత అంటే పవన్ కు ఎంతో అభిమానం. ఆ తరువాత పవన్ రత్నం నిర్మించిన ‘బంగారం’ సినిమాలో నటించినా ఆ సినిమా ఫెయిల్ కావడంతో ఎ.ఎమ్. రత్నం నష్ట పోయాడు. ఆ తరువాత ఈ నిర్మాత మరిన్ని సినిమాలు తమిళంలో తీసి ఆర్ధికంగా బాగా నష్టపోయాడు. ఆ పరిస్థుతులలో రత్నంను ఆదుకుంటానని పవన్ అప్పట్లోనే మాట ఇచ్చాడు అని టాక్. 

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా పవన్ ఎస్.జె. సూర్య దర్శకత్యంలో  లేటెస్ట్ గా సినిమాను చేస్తున్న నేపధ్యంలో ఎ.ఎమ్ రత్నం మళ్ళి రంగంలోకి వచ్చాడు అని తెలుస్తోంది. ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ ఎస్. జె. సూర్యాల లేటెస్ట్ మూవీ తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేదాలం’ సినిమాకు అనుసరణ అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా రీమేక్ రైట్స్ ను పవన్ కు ఇప్పించడంలో ఎ.ఎమ్. రత్నం కీలక పాత్ర వహించాడని టాక్.

ఈ నిర్మాత చేసిన సహాయానికి కృతజ్ఞతగా పవన్ గతంలో తాను ఇచ్చిన మాటను గుర్తుకు చేసుకుని రత్నంకు ఒక సినిమా చేసి పెడతానని మాట ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ దాసరి నారాయణ రావుకు ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చి ఉండటంతో అటు దాసరిని ఇటు ఎ.ఏం. రత్నం ను కలిపి ఒక జాయింట్ ప్రాజెక్ట్ మూవీగా ఒక భారీ సినిమాను చేసి అటు దాసరికి ఇటు రత్నంకు ఇచ్చిన మాటను ఒకేసారి నిలబెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు టాక్..


కత్తిలాంటి ఫిగర్ ని పట్టేసిన మెగాహీరో  

సెక్స్: పడకపై ఆమె అదిరిపోవాలంటే  

loading...