News and Entertainment

షాక్: పవన్ పారితోషికం అంతా?


తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అంటే ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడే వారు. వారి స్థాయి ఏ హీరో అందుకోలేని పరిస్థితిలో పునాధిరాళ్లు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు  చిరంజీవి. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో అవరాధాలు దాటుకొని మాస్ అభిమానుల మనసు గెలుచుకొని మెగాస్టార్ గా ఎదిగారు..ఈయన వారసులుగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలుగా వస్తున్నారు. 

వారిలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్ ఒకరు. అయితే అన్నయ్య ఇమేజ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన మ్యానరీజంతో స్టయిల్ తో తెలుగు అభిమానులు మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాన్ అంటే ఓ ప్రభంజనంలా తయారైంది.తెలుగు రాష్ట్రాల్లో పవనీజం మారు మోగుతుంది. ఇక పవన్ కళ్యాన్ సినిమా అంటే భారీ అంచనాలు మొదలయ్యాయి..ఈ క్రమంలో అత్తారింటికి దారేది చిత్రం తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ చిత్రంతో ఉగాది రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు..కానీ అనుకున్న స్థాయిలో ఆ సినిమా విజయం సాధించలేక పోయింది. దీంతో నిర్మాతలతో పాటు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారు. తాజాగా పవన్ కళ్యాన్ మరో చిత్రానికి రెడీ అవుతున్నారు..గతంలో పవన్ కెరీర్ లో ‘ఖుషి’ చిత్రం అద్భుతమైన విజయం సాధించించిన విషయం తెలిసిందే..ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. 

దర్శకులు ఎస్.జె.సూర్య. పవన్ తన గొప్ప మనసుతో ప్రస్తుతం ఎస్.జే. సూర్య దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ద్వారా ఆ నష్టాలను భర్తీ చేసి, వాళ్ళను ఆదుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో మరో వార్త చక్కర్లు కొడుతుంది.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాతలతో పాటు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిని విషయం కూడా తెలిసిందే..అయితే వారిని ఆదుకోవాలని అప్పట్లో పవన్ ని కలిసిన విషయం తెలిసిందే.

దీంతో పవన్ స్పందించి తన గొప్ప మనసుతో ప్రస్తుతం ఎస్.జే. సూర్య దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ద్వారా ఆ నష్టాలను భర్తీ చేసి, వాళ్ళను ఆదుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇక సూర్య తీయబోయే చిత్రానికి  పవన్ ఏకంగా 25 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే అత్యధిక పారితోషకం కానుందని సమాచారం. దీంతో పవర్ స్టార్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదని అభిమానులు సంబర పడిపోతున్నారు.

loading...