News and Entertainment

చత్రపతి శివాజి రాజమౌళి మూవీ



మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన యోధుడు చత్రపతి శివాజి. ఇప్పటికే చత్రపతి శివాజి పై ఎన్నో టెలిస్టోరీలు, సినిమాలు వచ్చాయి. అలా వచ్చిన ఏ మూవీ సైతం ప్రేక్షకులు మన్ననలను పొందలేకపోయింది. అయితే ప్రస్తుతం చత్రపతి శివాజి పై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కన్ను పడిందని అంటున్నారు.


బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...వెండితెరపై 'బాహుబలి' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక రీజనల్ డైరెక్టర్ క్రియేట్ చేసిన ఈ వండర్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సంచలనాన్ని క్రియేట్ చేసింది. దీంతో బాలీవుడ్ కి చెందిన ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు, రాజమౌళీతో మూవీలకి సిద్ధం అయ్యాయి.



సాధారణ సినిమాలను కాకుండా, రాజమౌళితో ఓ మహావీరుని కథాంశంలో కూడిన కథలను తెరకెక్కించాలని వారు ప్రయత్నిస్తున్నారు. అందులోని భాగంగానే బాలీవుడ్ కి చెందిన ఓ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ, రాజమౌళితో చత్రపతి శివాజీ జీవితంలోని చివరి మజీలినీ సినిమాగా తెరకెక్కించాలని చూస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం శివాజీ నేపథ్యంలో వచ్చే కథని కాకుండా మరో కథని పరిశీలిస్తున్నాడంట.


బాహుబలి మూవీ అనంతరం రాజమౌళి, బాలీవుడ్ లో చేయబోయే సినిమా ఇదేనని అంటున్నారు. అయితే రాజమౌళితో మాట్లాడిన ప్రొడక్షన్ కంపెనీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం, వారు రాజమౌళితో చత్రపతి శివాజీ కథని చేయటానకి మాత్రమే ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది. అందుకు రాజమౌళిని వారు ఇప్పటికే కన్విన్స్ చేశారని అంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే బయటకు రానుందని అంటున్నారు. 

కత్తిలాంటి ఫిగర్ ని పట్టేసిన మెగాహీరో  


loading...