News and Entertainment

సమంత పెళ్లి ఆ హైదరాబాద్ కుర్రాడితోనేనా



ఈ హెడ్డింగ్ చూస్తే చాలా మందికి రక‌ర‌కాల అనుమానాలు వ‌స్తాయి. చేతినిండా సినిమాలు, అటు త‌మిళ్‌, ఇటు తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న టైంలో స‌మంత పెళ్లి చేసుకుంటుందా…అది కూడా హైద‌రాబాద్ కుర్రాడితో స‌మంత పెళ్లా ఈ ప్ర‌శ్న‌ల‌కు ర‌క‌ర‌కాల స‌మాధానాలు దొరుకుతాయి. ఈ స‌మ్మ‌ర్ అంతా సౌత్‌లో స‌మంత మాయ న‌డుస్తోంది. త‌మిళ్‌లో ఆమె న‌టించిన తెరీ, 24 మూవీలు రిలీజ్ అయ్యి రెండూ హిట్ కొట్టాయి. తెలుగులో మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం, నితిన్ తో అ..ఆ సినిమాల షూటింగులు ముగిశాయి. ఈ రెండు స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

ఇక ఎన్టీఆర్‌తో జ‌న‌తా గ్యారేజ్ మూవీ షూటింగ్‌లో ఆమె పాల్గొంటొంది. అయితే తాజాగా ఓ ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక కథ‌నం ప్ర‌కారం స‌మంత పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల‌నుకుంటోంద‌ట‌. హైదరాబాద్ కు చెందిన ఓ కుర్రాడ్ని మ్యారేజ్ చేసుకుని లైఫ్ జాలీగా గడపాలని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో స‌మంత చాలా అంశాలు వెల్ల‌డించింది.


పొద్దున్న నిద్ర లేవగానే ఏ సినిమా షూటింగ్ కు వెళ్ళాలో తెలియక మర్చిపోతుంటానని, తన క్లోజ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికే ఆమెకు టైం దొరకడం లేదట‌. తన కో-స్టార్స్ మహేష్ బాబు కూతురు సితార, జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రాం లతో ఆడుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాన‌న్న స‌మంత‌, త‌న‌కు వ‌య‌స్సు 29 సంవ‌త్స‌రాలు అని ఇప్పుడు మ్యారేజ్ టైం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చినందున పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాల‌నుకుంటున్న‌ట్టు పేర్కొంది. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అభ‌య్‌రామ్ కార్బ‌న్ కాపీ అని న‌వ్వుతూ చెప్పుకొచ్చింది స‌మ్మూ బేబీ.

ఇవ‌న్నీ బాగానే ఉన్న ఇంత‌కు మ‌రి స‌మంత చెప్పిన‌ట్టు ఆ హైద‌రాబాద్ కుర్రాడు ఎవ‌ర‌నేది తెలియ‌డం లేదు. ఆమె చెప్పిన దానిని బ‌ట్టి టాలీవుడ్‌లో గ‌తంలో ఆమెతో సినిమాలు చేసిన ఓ టాప్ ఫ్యామిలీకి చెందిన హీరో అయి ఉండ‌వ‌చ్చేమో అన్న అనుమానాలు చాలా మంది వ్య‌క్తం చేస్తున్నారు.


కత్తిలాంటి ఫిగర్ ని పట్టేసిన మెగాహీరో  


loading...