News and Entertainment

బన్నీ కామెంట్స్- రాజమౌళికి షాక్



‘సరైనోడు’ సూపర్ సక్సస్ ఇచ్చిన జోష్ తో మంచి స్పీడ్ మీద ఉన్న అల్లుఅర్జున్ తన మాటల విషయంలో కూడ అదే స్పీడ్ ను కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన ‘సరైనోడు’ సక్సస్ మీట్ లో పవన్ అభిమానులకు కోపం తెప్పించే వ్యాఖ్యలు చేసిన అల్లుఅర్జున ఈసారి ఏకంగా ‘బాహుబలి’ కలక్షన్స్ ను టార్గెట్ చేసే అర్ధం వచ్చేడట్లుగా చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.   

ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ తన భవిష్యత్ కెరియర్ ప్లాన్స్ వివరిస్తూ ఇలా ‘బాహుబలి’ కలక్షన్స్ ను టార్గెట్ చేసే కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత టాలీవుడ్ సినిమా రంగం గురించి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమాలు దక్షిణాది రాష్ట్రాలు అన్నింటిలోను తన సత్తాను చాటుకుంటున్నాయని కామెంట్స్ చేసాడు. ‘బాహుబలి’ మూవీ తెలుగు తమిళ్ హిందీ భాషల్లో రిలీజ్ అయింది కాబట్టే అంత భారీ కలక్షన్స్ వచ్చాయి అని చెపుతూ భవిష్యత్ లో తాను కూడ తన సినిమాలను దక్షిణాది రాష్ట్రాలు అన్నింటిలోను విడుదల చేసి తన స్థాయిని పెంచుకుంటాను అని అంటూ తెలుగులో ‘బాహుబలి’ తరువాత అత్యధిక కలక్షన్స్ వసూలు చేసిన సినిమా తన ‘సరైనోడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.


దక్షిణాది సినిమా రంగంలో టోటల్ గా పాగావేసేందుకు బన్నీ ప్రయత్నిస్తున్నాడు అని అర్ధం వచ్చేలా అల్లు అర్జున్ కామెంట్స్ కనిపిస్తున్నా ఏకంగా ‘బాహుబలి’ కలక్షన్స్ తో తన ‘సరైనోడు’ ను పోలుస్తూ బన్నీ చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇదే సందర్భంలో బన్నీ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో తన  సినిమా టాప్ ఫైవ్ లిస్ట్ లో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ‘సరైనోడు’ తో తన కోరిక తీరింది అని అంటున్నాడు. 

క్రిటిక్స్ మెచ్చుకోకపోయానా తన సినిమాకి ప్రేక్షకుల ఆదరణ లభించింది అని అంటూ తాను త్వరలో దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్న విషయాన్ని బయట పెట్టాడు. అయితే ప్రయోగాత్మక సినిమాలకు చిరునామాగా ఉండే విక్రమ్ కుమార్ బన్నీల కాంబినేషన్ ఎంత వరకు సక్సస్ అవుతుంది అన్న సందేహాలను చాలామంది వ్యక్త పరుస్తున్నారు..

loading...