News and Entertainment

‘బ్రహ్మోత్సవం’ చూసి బాధతో ఈ ఓపెన్ లెటర్!బ్రహ్మోత్సవం సినిమా చూసిన వారంతా ఏదో ఒకరకంగా తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. సినిమా అభిమానులు సైతం ఊహించనంత దారుణంగా ఉండటమే ఇందుకు కారణమని వారి ఫ్రస్టేషన్ చూస్తే స్పష్టమవుతుంది. కొందరు అభిమానులైతే సోషల్ మీడియా ద్వారా ఓపెన్ లెటర్స్ పోస్టు చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు.... శ్రీకాంత్ అడ్డాల అభిమానులు కూడా సినిమా చూసిన అనంతరం తమలోని వేదనను వెల్లగక్కుతున్నారు. 

శ్రీకాంత్ అడ్డాలకు ఓ అభిమాని రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే పేరు లేకుండా ఉన్నఈ లేఖను సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా షేర్ చేస్తుండటంతో వైరల్ లా వ్యాపించింది. ఆ లేఖపై మీరూ ఓ లుక్కేయండి.


loading...