News and Entertainment

కత్తిలాంటి ఫిగర్ ని పట్టేసిన మెగాహీరోమెగాహీరోల సరసన ఆఫర్స్ ని చేజిక్కించుకోవటానికి చిన్న హీరోయిన్స్ నుండి టాప్ హీరోయిన్స్ వరకూ అందరూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే  ఒక్కసారి మెగాహీరోల సరసన ఆఫర్ వచ్చిందంటే చాలు, ఏదొక విధంగా మరో మెగాహీరో సరసన ఆఫర్ ని పట్టేయవచ్చు అనేది హీరోయిన్స్ నమ్మకం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా 'శ్రీరస్తు శుభమస్తు' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ మూవీ తరువాత వెంటనే అల్లశిరీష్ మరో మూవీకి శ్రీకారం చుడుతున్నాడు. గత కొంత కాలంగా ఎటువంటి మూవీలను ఒప్పుకోకుండా ఐడిల్ గా ఉన్న అల్లుశిరీష్, ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ కావటంతో...క్రేజీ హీరోయిన్స్ అంతా అల్లుశిరీష్ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ హీరో...మెహరీన్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నాడని అంటున్నారు.'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమా ద్వారా తెలుగు తెరకి మెహరీన్ పరిచయమైన విషయం తెలిసిందే. ఈ మూవీతో మెహరీన్ కి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే మెహరీన్ చేతిలో దాదాపు 5 చిత్రాల వరకూ ఉన్నాయి. అందులో అల్లుశిరీష్ మూవీనే పెద్ద బడ్జెట్ ఉన్న చిత్రం.

అల్లుశిరీష్ సైతం, మెహరీన్ ని హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి కనబరచటంతో వీరిద్దరూ ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేయటమే ఇక తరువాయి అంటున్నారు. అల్లుశిరీష్, మెహరీన్ కాంబినేషన్ బాగుంటుందని ఇప్పటికే వీరిద్దరిపై జరిగిన ఫోటోషూట్ ద్వార క్లారిటీ వచ్చిందని అంటున్నారు.


ఇది కూడా చదవండి:


loading...