News and Entertainment

జనతా గ్యారేజ్ కథ లీక్... అదిరిపోయే కధ



యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా జనతా గ్యారేజ్. ప్రస్తుతం షూటింగ్ స్పీడ్ గా చేసుకుంటున్న ఈ సినిమా కథ లీక్ అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాదు లీక్ అయిన కథ నిజంగా గ్యారేజ్ రియల్ స్టోరీ అయితే సినిమా సూపర్ హిట్టే అంటున్నారు విన్నవాళ్లు. ఇంతకీ జనతా గ్యారేజ్ కథేంటో మీరు చూడండి.. 

ఎన్టీఆర్ ఓ మెకానిక్ గా ఉంటాడు. అతను మామయ్యగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సాదాసీదాగా ఉంటాడు. హీరో అంటే మామకు చాలా ఇష్టం అయితే అది నచ్చని మోహన్ లాల్ తనయుడు ఉన్ని ముకుందన్ కు నచ్చదు. అయితే హైదరాబాద్ లో నివసిస్తున్న మోహన్ లాల్ కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రస్తుతం కామన్ మ్యాన్ లా కనిపిస్తున్న అతను ఓ మాఫియా డాన్. అయితే వాటిననంటిని కాదనుకుని మాములు జీవితాన్ని గడుపుతుంటాడు.

అయితే ఇది తెలుసుకున్న ఎన్టీఆర్ మామను దెబ్బ తీసిన వారి మీద చావు దెబ్బ కొట్టేందుకు డాన్ గా మారుతాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ అక్కడ తనకు తగిలే షాక్ ఎవరి వల్ల అంటే మోహన్ లాల్ తనయుడు ఉన్ని ముకుందన్ వల్లే. సో ఈ కథతో సినిమా నేపథ్యం సాగుతుంది అని కథ ఒకటి ఫిల్మ్ నగర్లో చెక్కర్లు కొడుతుంది.

ఇదే స్టోరీ కనుక సినిమాగ తెరకెక్కిస్తే సినిమా సూపర్ హిట్ అన్నట్టే. కాని సినిమా కథ ఇదే అయి ఉంటుంది అన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ ఇదే అయినా సరే కొరటాల మార్క్ కమర్షియల్ అంశాలతో సినిమా సూపర్ క్రేజ్ తో రానుంది. ఇక కథను బట్టి సినిమాలో మోహన్ లాల్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి సినిమా కథ ఇదా కాదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. 
loading...