News and Entertainment

పవనిజంకు వ్యతిరేకంగా గ్రూప్


పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా అభిమానుల్లో ఓ చీలిక ఏర్పడి కేవలం పవర్ స్టార్ అభిమానులుగా మారిన వారు కొంతమంది ఉన్నారు. వారే తమ అభిమాన హీరోని తెగ హడావిడి చేస్తూ అరుస్తుంటారు. అయితే కొన్ని మెగా హీరోల వేడుకల్లో కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతకుముందు నాగబాబు, రీసెంట్ గా అల్లు అర్జున్ రివర్స్ క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. 

అయితే దీన్ని ఇక పూర్తిగా మరోసారి రిపీట్ కాకుండా చూసేందుకు పవనిజం గ్రూప్ కు వ్యతిరేకంగా మెగా గ్రూప్ చర్యలు చేపట్టనుందట. మెగా వేడుక ఏదైనా పవర్ స్టార్ పవనిజం గ్రూప్ కు సంబందించిన వారికి అడ్డుకట్ట వేసే ఆలోచన ఈ గ్రూప్ చేస్తుందట. అయితే పవన్ ఓ మాట తన అభిమానులకు చెబితే చాలుగా ఇంత హంగామా అవసరమా అంటే.. మెగా అభిమానులు పవర్ స్టార్ ఫ్యాన్స్ మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది.


ఒకే అభిమాన సంఘాలు రెండుగా చీలి ఇలా గొడవలు పెట్టుకోవడం కూడా మంచి పద్ధతి కాదు. అయితే మెగా హీరోలందరు కలిసి పవన్ కు చెక్ పెట్టే విధంగా ఈ మెగా గ్రూప్ ను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. దాని మెగా కాంపౌండ్ ఆశీస్సులు ఉన్నాయని టాక్. మరి ఈ వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.

ఇకపోతే మెగా హీరోల విషాయాల్లో మాత్రం ఇలాంటి సంఘటనలు మరోసారి జరుగకుండా చేసే కార్యచరణలు చేస్తున్నారట మెగా ఫ్యాన్స్. పవనిజంకు సంబందించి ఎవరు కనబడ్డా మెగా ఈవెంట్ లకు రానివ్వకుండా అడ్డు పడేలా ఆలోచనలు చేస్తున్నారట.


రేష్మి ఆలీతో: నాదెందుకు పిసుకుతున్నావ్  

loading...