News and Entertainment

మహెష్ ని టార్గెట్ చేస్తూ వర్మ కామెంట్స్

తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఏ సినిమా విడుదలైనా ఆ సినిమా హీరో, దర్శకులపై కామెంట్స్ తన ట్విట్టర్ లో పెడుతుంటారు. అయితే అవి ప్రతిసారి ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటుంది. గతంలో సర్ధార్ గబ్బర్ సింగ్ ఫెల్యూర్ తో పవన్ పై ఎన్నో సెటైర్లు వేశారు. తాజాగా బ్రహ్మోత్సవం చిత్రం విడుదలై మిశ్రమ స్పందన రావడంతో ఇప్పుడు మహేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహేష్‌ బాబు బ్రహ్మోత్సవంలో ప్యాంట్‌ విదిలించుకొనే స్టెప్పులపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కామెంట్‌ చేశాడు.

ఇలాంటి స్టెప్పుల్ని చూసి వరల్డ్‌ ఫేమస్‌ కొరియోగ్రాఫర్లు కూడా నేర్చుకోవాల్సి ఉందని ఎద్దేవా చేశారు. అతే కాదు ఫ్యామిలీ సబ్జెక్ట్‌లు తీస్తే శోభన్‌ బాబులు అంటారు తప్ప కృష్ణ, ఎన్టీఆర్‌ అనరు. కాబట్టి మహేష్‌ ఎప్పుడూ మాస్‌ ఎలిమెంట్స్‌తో కూడిన పోకిరి, బిజినెస్‌మేన్‌ తరహా సినిమాలేచేయాలి తప్పా ఎలాంటి ఎంట్రటైన్ మెంట్ లేని ఫ్యామిలీ సినిమాలు తీస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని అన్నారు. దేవత సినిమా చూసినప్పుడు ఆ కథే గుర్తుంటుంది తప్ప శోభన్‌ బాబు గుర్తుండు. ఏజెంట్‌ గోపీ, అడవి రాముడు సినిమాల్ని చూస్తే కృష్ణ, ఎన్టీఆర్‌లు గుర్తుకొస్తారు తప్ప కథ కాదు.