News and Entertainment

రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ ఇదే?



ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న మూవీ తనిఒరువన్ తెలుగు రిమేక్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ  తెరకెక్కుతుంది. తమిళ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ మూవీ, తెలుగులోనూ మంచి సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకం రామ్ చరణ్ కి ఉంది. ఇక ఈ మూవీ తరువాత రామ్ చరణ్ ఎవరి కాంబినేషన్ లో నటించాలి? అనేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.

ఫిల్మ్ నగర్లో దీనికి సంబంధించిన కొంత సమాచారం బయటకు వచ్చింది. ఆ వివరాలను చూస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం తన మూవీలో కొంత స్లోగానే ఉన్నాడు. రామ్ చరణ్ మూవీలు కమర్షియల్ సక్సెస్ లు అవుతున్నాయి కానీ, భారీ సక్సెస్ లు మాత్రం కావటంలేదు. దీంతో రామ్ చరణ్, ఓ భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. మాస్ ఎంటర్టైన్మెంట్ స్టోరీలో సక్సెస్ కొట్టాలనేది చరణ్ నిర్ణయం.


అందుకు తగ్గ కథని రెడీ చేయాలని డైరెక్టర్ కొరటాల శివకి రామ్ చరణ్ చెప్పుకొచ్చాడంట. ప్రస్తుతం కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ తో జనత గ్యారేజ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంతరం రామ్ చరణ్ తో కథా చర్ఛల్లో పాల్గొనే ఛాన్స్ ఉందని అంటున్నారు. దాదాపు వీరిద్దరి కాంబినేషన్ ఫిక్స్ అయినట్టే అని మెగా కాంపౌండ్ నుండి వస్తున్న వార్తలు.

గతంలో వక్కంతం వంశీ సైతం రామ్ చరణ్ తో తన మొదటి సినిమాని ప్లాన్ చేయాలని చూశాడు. కానీ అది కాస్త పోస్ట్ పోన్ అయి, ఇప్పుడు జూనియర్ తో వక్కంతం వంశీ మూవీని ప్లాన్ చేశాడు. మొత్తంగా రామ్ చరణ్, తనిఒరువన్ తెలుగు రిమేక్ కంప్లీట్ అయిన తరువాత నెల రోజుల గ్యాప్ లోనే మరో మూవీకి శ్రీకారం చుట్టే ఛాన్స్ ఉందని కూడ అంటున్నారు.



ఇది కూడా చదవండి:
ఫన్నీ : బ్ర‌హ్మోత్స‌వంపై ఇన్ని సెటైర్లా?  


loading...