News and Entertainment

సమంత ఇంటర్వ్యూ:అలా చెబితే మహేష్ బాబు చంపేస్తాడు



సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస విజయాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. నటించిన తమిళ చిత్రం తేరి(తెలగులో పోలీస్) భారీ విజయం సాధించడంతో పాటు, సూర్యకు జోడీగా నటించిన '24' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో విజయానందాన్ని పంచుకున్నారు. 


పాత్రికేయులతో చిట్ చాట్ చేసారు. '24' ఓ ఇంటెలిజెంట్ మూవీ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే 'థెరి', '24' చిత్రాలు పెద్ద సక్సెస్ కావడం గర్వంగా కూడా ఉంది. ఇక 'బ్రహ్మోత్సవం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది అని సమంత చెప్పుకొచ్చారు. డైరెక్టర్ విక్రమ్ గారు నాకు కథ వినిపించేప్పుడే ఈ సినిమాకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా అనిపించింది. 


ఈగ సినిమా కథ వినగానే ఎలా ఫీలయ్యానో 24 సినిమా వినగానే అలానే ఫీలయ్యాను. సమంత ఒక సినిమా చేస్తుందంటే దాంట్లో కొంచెమైనా గ్యారంటీగా ఏదో కొత్తగా ఉంటుందని అనుకోవాలి. అందుకనే నేను స్క్రిప్ట్స్ ఎంపికలో కేర్ తీసుకుటానని సమంత తెలిపారు. నేను ఏదైనా సినిమా చేస్తున్నానంటే నా పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందనే విషయం ఆలోచిస్తాను. '24' సినిమాలో ఎంత పెద్ద పాత్ర చేసేమని కాదు, సినిమాలో భాగమయ్యామా లేదా అనేదే ముఖ్యం. 


విక్రమ్ కుమార్ గారి సినిమాల్లో రొమాంటిక్ పార్ట్ చాలా స్వీట్ గా, అందంగా ఉంటుంది. 24 చిత్రంలో కూడా అలానే ఉంటుందని సమంత చెప్పుకొచ్చారు. బ్రహ్మోత్సవం గురించి, మహేష్ బాబు కూతురు గురించి సమంత చెప్పిన విషయాలు స్లైడ్ షోలో...
loading...