News and Entertainment

ఏంటయ్యా మహేష్ బాబూ..ఇదేమన్నా బాగుందా!



టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ అంటే అమ్మాయిల కలల రాకుమారుడు.. రాజకుమారుడు.. అలాంటి మహేష్ ఈమధ్య ఫ్యాన్స్ ను తెగ ఇబ్బంది పెడుతున్నాడన్నది అసలు మ్యాటర్. అదేంటి అభిమానులను ఇబ్బంది పెట్టే పని మహేష్ ఏం చేశాడు అంటే.. ఏముంది సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేకుండా సూపర్ క్లాస్ హిరో అవతారమెత్తడం.

మహేష్ సినిమా అంటే ఉండే అంచనాలు మనకు తెలిసిందే.. సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అయితే మహేష్ ఈ మధ్య తన పంథా మార్చుకున్నాడు. కేవలం ఫ్యామిలీ అండ్ స్టోరీ బేస్డ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులోనే ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తున్నా అభిమానులు తన నుండి ఫుల్ లెంథ్ మాస్ సినిమాను ఆశిస్తున్నారు.



అయితే ఎవరేం చెప్పినా తనకు నచ్చిన సినిమానే చేసుకుంటూ పోతున్నాడు మహేష్. శ్రీమంతుడు సినిమా బ్యాక్ టు విలేజ్ కాన్సెప్ట్ తో తెరకెక్కితే ఇక రాబోతున్న బ్రహ్మోత్సవం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది. అయితే మహేష్ సినిమాలు ఫ్యామిలీ ప్రేక్షకులంతా చూసేందుకు ఇష్టపడుతున్నా ఎక్కడో ఫ్యాన్స్ కు ఓ చిన్న అసంతృప్తి అన్నది కలుగుతుందని చెప్పగలం.

అందుకోసమే మురుగదాస్ తో పక్కా కమర్షియల్ సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు మహేష్. ఆ సినిమా అయినా అభిమానులకు ఓ ఫీస్ట్ ఇచ్చే సినిమా అవుతుందేమో చూడాలి. ఇక బ్రహ్మోత్సవం ఈ నెల 20 నుండి సంబరాలు స్టార్ట్ చేస్తున్న మహేష్ శ్రీమంతుడుతో క్రియేట్ చేసిన రికార్డులన్ని ఈ సినిమాతో బద్ధలు కొట్టాలని చూస్తున్నాడు


ఇది కూడా చదవండి:


loading...