News and Entertainment

టాలీవుడ్ రీసెంట్ భారీ ఫ్లాపు సినిమాల లెక్కలు ఇవే


గెలుపు ఉన్న చోట ఓటమి ఉంటుంది. అలాగే హిట్స్ ఉన్న చోట ప్లాపులు ఉంటాయి. ఎంత పెద్ద హీరో అయినా ప్లాపులకు అతీతుడే ఏమీకాదు. సినీ జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటివి ఎదురు కాక తప్పదు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ప్లాపుల లిస్టులో చేరి పోయింది. మహేష్ బాబు సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే భారీ హిట్, లేకపోతే భారీ ప్లాప్. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు సినిమాలు యావరేజ్ ఆడియన సందర్భాలు లేనే లేవు. ''బ్రహ్మోత్సవం'' సినిమా డిజాస్టర్ కా బాప్ అని తేలిపోయిందని అంటున్నారు విశ్లేషకులుక. 

ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజున మిక్సడ్ టాక్ వచ్చిన చాలా సినిమాలకు తరువాత కలక్షన్లు బాగానే వస్తున్నాయి. అయితే 'బ్రహ్మోత్సవం' సినిమాకు మిక్స్డ్ టాక్ కాదు పూర్తిగా నెగెటివ్ టాకే నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాపై పేలుతున్న జోకులు, నెగెటివ్ ప్రచారం చూసి చాలా మంది ఈ సినిమా చూడాలనే ఆలోచనే మానేసారు. 

ఎందుకు ఈ సమ్మర్ టాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు కలిసి రాలేదు. పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఇటీవల విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్లైడ్ షోలో ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో భారీ ప్లాపులు చవి చూసిన ఈ జనరేషణ్ స్టార్ హీరోల సినిమాల వివరాలు...

loading...