News and Entertainment

ఆవు మూత్రంలో బంగారం వ‌స్తుంద‌ట‌ శాస్త్రవేత్త‌లే తేల్చేశారు


అవును, మీరు విన్న‌ది నిజమే. అదేంటి, ఆవు మూత్రంలో బంగారం రావ‌డం ఏంటి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అయినా ఇది నిజ‌మే. ప‌లువురు ప‌రిశోధ‌కులు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది. ఇంత‌కీ అస‌లు ఆవు మూత్రం నుంచి బంగారం ఎలా వ‌స్తుంద‌నేగా మీ డౌట్‌! అయితే ఆ డౌట్‌ను వెంట‌నే క్లియ‌ర్ చేసుకుందాం పదండి.

గుజ‌రాత్ రాష్ట్రంలోని జునాగ‌ఢ్‌కు చెందిన అగ్రిక‌ల్చ‌రల్ యూనివ‌ర్సిటీ శాస్త్రవేత్త‌లు గ‌త నాలుగేళ్లుగా ‘గిర్’ అనే జాతికి చెందిన ఆవుల మూత్రంపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఆవు మూత్రం వ‌ల్ల ఏయే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయోనన్న అంశంపై వారు ప‌రిశోధ‌న‌లు చేయ‌గా వారికి ఓ ఆస‌క్తిక‌రమైన విష‌యం తెలిసింది. అదేమిటంటే ఆవు మూత్రంలో అత్యంత సూక్ష్మ ప‌రిమాణంలో అంటే అయాన్ల రూపంలో బంగారం ఉన్న‌ట్టు గుర్తించారు. ఒక లీట‌రు ఆవు మూత్రంలో ఆ బంగారం సుమారు 3 నుంచి 10 మిల్లీగ్రాముల వ‌ర‌కు ఉంటుంద‌ని వారు తేల్చేశారు. కొన్ని ప్ర‌త్యేక‌మైన ర‌సాయ‌న చ‌ర్య‌ల ద్వారా ఆ బంగారాన్ని వెలికి తీయ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. నిజంగా ఇది ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యమ‌ని వారు అంటున్నారు.


అయితే ఆవు కాకుండా ఇత‌ర జీవాలైన గేదె, మేక‌, ఒంటె వంటి ప్రాణుల మూత్రాన్ని కూడా ఆ సైంటిస్టులు ప‌రీక్షించారు. కానీ వాటిలో బంగారం మాదిరిగా ఉండే అయాన్లు ఏవీ లేవ‌ట‌. కానీ ఆవు మూత్రంలో మాత్రం బంగారం ఉంద‌ని వారు చెబుతున్నారు. అందువ‌ల్లే ఆవు మూత్రం మ‌న‌కు క‌లిగే ఎన్నో ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వారు అంటున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం గిర్ అనే జాతికి చెందిన దాదాపు 400 ఆవుల మూత్రాన్ని ప‌రిశోధ‌కులు ప‌రిశీలించ‌గా అన్ని శాంపిల్స్‌లోనూ బంగారం ఉంద‌ని తెలిసింది.

అయితే ఈ జాతి కాకుండా మిగ‌తా జాతుల‌కు చెందిన ఆవు మూత్రంలోనూ ఇలాంటి బంగారం అణువులు ఉంటాయో లేదో తేల్చాల్సి ఉంద‌ని, అందుకోసం మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేయ‌నున్నామ‌ని ఆ సైంటిస్టులు చెబుతున్నారు. నిజ‌మేగా మ‌రి, మ‌న భార‌తీయ హిందూ సాంప్రదాయం ప్ర‌కారం పురాణాల్లో ఎంతో మంది మునులు, మ‌హ‌ర్షులు గోమూత్రం ఎంతో మంచిద‌ని, దాని వ‌ల్ల మ‌న‌కు ఎన్నో విధాలుగా లాభ‌మే క‌లుగుతుంద‌ని చెప్పారు క‌దా. కానీ నేటి ఆధునిక యుగంలో మ‌న‌మే దాని గురించి పూర్తిగా మ‌ర‌చిపోయాం. అందుకే మ‌న వేదాలు, పురాణాల గొప్ప‌త‌నం ఏమిటో ఇప్ప‌టికైనా తెలుసుకుంటే దాంతో మ‌నం ఎంతో లాభం పొంద‌వ‌చ్చు. అంతే క‌దా!

ఇవి కీడా చదవండి:


loading...