News and Entertainment

గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్నారా? అయితే ఇది తప్పక చదవండి.!


ప్రస్తుతం అందరూ వాడుతున్న బ్రౌజర్లలో గూగుల్‌ క్రోమ్‌కు విశిష్ట స్థానం ఉంది. అయితే ఇతర బ్రౌజర్లతో పోల్చుకుంటే గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్న ల్యాప్‌టాప్‌, పీసీల బ్యాటరీ త్వరగా అయిపోతోందట. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రకటించింది. దీన్ని నిరూపించేందుకు ఒకేలాంటి ల్యాప్‌టాప్‌లను నాలుగు తీసుకుని మొదటి దానిలో మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌, రెండో దానిలో ఓపేరా, మూడో దానిలో మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, నాలుగో దానిలో గూగుల్‌ క్రోమ్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉపయోగించారు.

బ్యాటరీ చార్జింగ్‌ విషయంలో మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ మొదటి స్థానంలో నిలిచింది.

మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌తో పనిచేసిన ల్యాప్‌టాప్‌ బ్యాటరీ దాదాపు 7 గంటల 22 నిమిషాలపాటు పనిచేసింది.

తర్వాతి స్థానంలో నిలిచిన ఒపేరాతో పనిచేసిన ల్యాప్‌టాప్‌ బ్యాటరీ చార్జింగ్‌ 6 గంటల 18 నిమిషాలపాటు నిలిచిఉంది.

ఇక, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ బ్యాటరీ 5 గంటల 9 నిమిషాలు వర్క్‌ చేసింది.

చివర్లో నిలిచిన గూగుల్‌ క్రోమ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ బ్యాటరీ కేవలం 4 గంటల 19 నిమిషాల్లోనే డెడ్‌ అయిపోయింది.

దీని ప్రకారం గూగుల్‌ క్రోమ్‌ కంటే ఎడ్జ్‌ బ్రౌజర్‌ ఎంతో మెరుగ్గా కనిపోస్తుంది. కానీ, క్రోమ్‌లో ఉన్నన్ని ఫీచర్లు ఎడ్జ్‌ బ్రౌజర్‌లో ఉండవు.

loading...