News and Entertainment

అరటి పండులో HIV వైరస్ ? ఇందులో నిజమెంత?


సోషల్ మీడియా పుణ్యాన…అవాస్తవాలు సైతం అంతే వేగంగా ప్రచారం పొందుతున్నాయి. ఇంకా అవి ఆరోగ్యానికి సంబంధించినవైతే మరీను…! విపరీతమైన షేరింగులతో వాట్సాప్, ఫేజ్ బుక్ , ట్విట్టర్లు హోరెత్తిపోతాయి. కొన్ని రోజులుగా అరటిపండు విషయంలో ఓ రూమర్ విపరీతంగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అరటి పండు మద్యలో ఎర్రగా ఉన్న ప్రాంతాన్ని పిక్ గా పెట్టి,. ఎవరో ఎయిడ్స్ ఉన్న వ్యక్తి తన రక్తాన్ని అరటి పండ్లకు ఎక్కిస్తున్నాడు. అందుకే అరటి పండు మద్య భాగం రక్తం రంగులో ఇలా ఉంది అని డిస్క్రిప్షన్ సైతం ఇవ్వడం. ఇటువంటి వాటిని తినకండీ అంటూ హెచ్చరికలు కూడా ఇవ్వడంతో చాలా మంది ఇది నిజమే అని అనుకున్నారు.

అయితే….ఇది పచ్చి అబద్దం. ఒకవేళ నిజంగానే ఓ HIV పాజిటివ్ ఉన్న వ్యక్తి తన రక్తాన్ని ఇలా అరటిపండుకు ఎక్కించాడే అనుకుందాం… అయితే  HIV వైరస్… రక్తం, వీర్యం లలో తప్పించి బయట ఏ ప్రదేశాల్లో అయిన 6 సెకండ్ల కంటే ఎక్కువగా బ్రతకదు. దీనిని బట్టి, అరటి పండులో HIV  వైరస్ అనేది ఉత్తమాటే.

అరటి పండు ఇలా మద్యలో ఎర్రగా కావడానికి అసలు కారణం… శీలీంధ్రం. దీని వల్ల అరటికి ఎర్ర తెగుళు వస్తుంది. దీని కారణంగా అరటి పండు మద్య భాగం ఇలా ఎర్రగా మారుతుంది. ఇంతే కాదు..ఇటీవల కాలంలో చెమట ఎక్కువగా వస్తే చర్మ వ్యాధులు వస్తాయంటూ ఓ యాడ్ జనాల్ని మభ్యపెడుతుంది. ఇది కూడా ఒట్టిమాటే..చెమట పట్టకపోతేనే శరీరం రోగాల పుట్ట అవుతుంది.

ఇవి కూడా చదవండి:
ఈ పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే ..ముందు వాటిని తొలగించేయండి
ఈ భంగుమల్లో సెక్స్ చేస్తే అమ్మాయిలకి ఇష్టమట
ఒకే రోజు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల నష్టాలు
loading...