News and Entertainment

జనతా గ్యారేజ్ స్టోరీ లీక్


తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ మనవడు..నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా అడుగు పెట్టాడు. ఇండస్ట్రీలో మాస్ ఫ్యాన్స్ కావాలసిన డ్యాన్స్, ఫైట్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. తాత పోలికలు ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. రాజమౌళి మరో చిత్రం ‘యమదొంగ’ చిత్రంలో ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తాతకు మల్లే యముడి పాత్రలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. గత సంత్సరం టెంపర్ చిత్రంతో మరోసారి టెంపర్ రూపించాడు.ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రంతో బంపర్ హిట్ కొట్టాడు.

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. లీక్ అయిన స్టోరీ ప్రకారం ముంబైలో గ్యారేజ్ ను రన్ చేసే మోహన్ లాల్ కు మాఫియా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆయన మేనల్లుడు ఎన్టీఆర్. కొడుకు ముకుందన్. మోహన్లాల్ అల్లుడు ఎన్టీఆర్ పై ఎక్కువ అభిమానం చూపించడం ముకుందన్ కు ఇష్టం ఉండదు. మరో వైపు మోహన్ లాల్ ను పాత శత్రువులు చంపేందుకు వెంటాడుతూ ఉంటారు. ఎన్టీఆర్ మోహన్ లాల్ మాఫియా ఫ్లాష్బ్యాక్ గురించి తెలుస్తుంది.


మామయ్యను కాపాడుకునేందుకు ఎన్టీఆర్ మాఫియా పై పడతాడు. ఐఐటీ స్టూడెంట్ అయిన ఎన్టీఆర్ తన మామను మాఫియా నుండి ఎలా కాపాడుకుంటాడు? ఆ క్రమంలో సమంతను ఎలా ప్రేమలో పడేశాడు అనేది కథ అంటూ ప్రచారం జరుగుతోంది. స్టోరీ లైన్ చూస్తే చాలా బాగుంది..ఒక వేళ ఇదే స్టోరీ అయితే మాత్రం కొరటాల చేయబోయే దర్శకత్వం ఇంకా అద్భుతంగా ఉండొచ్చి అభిమానులు భావిస్తున్నారు. 
loading...