News and Entertainment

NTR: మా అందరికీ ఇన్స్‌పిరేషన్ ఎప్పటికీ చిరంజీవి గారే


నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన మా టివి అవార్డ్స్ ఫంక్షన్‌ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల పై అప్పుడే బాలకృష్ణ అభిమానులు పెనుదుమారం సృష్టిస్తున్నారు  చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా ‘టెంపర్’ చిత్రానికి బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్న తరువాత అనుకోకుండా జూనియర్ చేసిన ఈ  కామెంట్స్ అనుకోని వివాదాలకు వేదిక అయింది. 

ఇక వివారలలోకి వెళ్ళితే  యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్నేళ్లు వచ్చినా, ఎన్నితరాలు మారినా, తమ తరం హీరోలకు  ఇన్స్‌పిరేషన్ చిరంజీవి అని  చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. చిరంజీవి పేరు జూనియర్  నోటి వెంటరాగానే అభిమానుల కేకలు ఈలలతో మా అవార్డ్స్  ఫంక్షన్ ప్రాంగణం అదిరి పోయింది. 
అయితే వెంటనే సర్దుకుని బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ పేర్లను చెప్పాడు.  అయితే అసలు దిగ్గజాల పేర్లను వదిలేసి మొదట చిరంజీవి పేరు చెప్పడం

ఏమిటని బాలయ్య అభిమానులు జూనియర్ మాటల పై మండి పడుతున్నారు.

అంతేకాదు ఎప్పుడూ తన తాత నందమూరి తారక రామారావు పేరు భజన చేసే జూనియర్ ఇలా తన  వ్యూహం మార్చి చిరంజీవి పేరు చెప్పడం వెనుక ఏమైనా వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా అనే అనుమానాలు బాలకృష్ణ  అభిమానులు వ్యక్త పరుస్తున్నారు.  ఈవిషయం ఇప్పుడు బాలకృష్ణ అభిమానుల మధ్య మాత్రమే కాకుండా టాలీవుడ్ వర్గాలలో రకరకాల చర్చలకు దారి తీస్తోంది.

అయితే ఈ వాదనను జూనియర్అభిమానులు తోసి పుచ్చుతూ తొలుత స్టేజీ‌పై వున్నవారికి గౌరవం ఇవ్వడం  సంప్రదాయం కాబట్టి జూనియర్ ఇలా ప్రవర్తించి ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్స్ విన్న బాలయ్య అభిమానులు మాత్రం  ఎక్కడపడితే అక్కడ తాత పేరు చెప్పుకుని నందమూరి అభిమానుల ప్రాపకం కోసం పాట్లు పడే జూనియర్  భవిష్యత్ లో ఇక  చిరంజీవి పేరు చెపుతూ మెగా అభిమానులను కూడ తన అభిమానులుగా మార్చుకోవడానికి ఇలా కామెంట్ చేసి ఉంటాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.. 

** CINE MAA Awards-2016 లో చిరు అదిరిపోయే డాన్స్(VIDEO)
Read: నాతో ఒక్క రాత్రి గడిపితే 7 కోట్లు ఇస్తా... ఆఫర్ ఏంటో చూడండి
Readషాకి ఇచ్చిన ప్రముఖ నటుడు: రాత్రంతా మంత్రి కూతురు తో సెక్స్ చేశా!