News and Entertainment

రాజమౌళిని షేక్ చేస్తున్న కోడి రామకృష్ణ ప్రయోగం


దర్శక రత్న దాసరి నారాయణరావు శిష్యుడుగ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కోడి రామకృష్ణ 100 సినిమాలకు దర్శకత్వం వహించిన ఒకనాటి ప్రముఖ దర్శకుడు. తెలుగు సినిమా రంగంలో రాజమౌళి కంటే ముందు అద్బుతమైన గ్రాఫిక్స్ తో సినిమాలు తీసిన ప్రతిభ ఈయన సొంతం.  ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అంజ’, ‘అరుంధతి’ లాంటి గ్రాఫిక్ అద్భుతాలను తెలుగు తెరకు పరిచయం చేసిన కోడి రామకృష్ణ హవా ఇప్పుడు తగ్గి పోయింది.  

ఆయన సమకాలీన దర్శకులంతా మెగా ఫోన్ పక్కన పెట్టినా ఇప్పుడు మళ్ళీ పట్టుదలతో అదే కాన్సంట్రేషన్ ని చూపిస్తూ దర్శకత్వం వహిస్తూ మరో విజువల్ అద్బుతానికి తెరతీసాడు కోడి రామకృష్ణ. ఆ సినిమా పేరు ‘నాగరహవు’ ఈ సినిమాను తెలుగులో కూడ డబ్ చేయ బోతున్నారు. ట్విస్ట్ ఏమిటంటే ఏడేళ్ళ క్రితం మరణించిన కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్థన్ ముఖ్య పాత్రగా ఈసినిమా తీస్తున్నారు. 

ఆయన చనిపోయి ఇప్పటికే ఏడు సంవత్సరాలు దాటిపోయినా  గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆయన పాత్రను పున:సృష్టించి ఆ పాత్రనే లీడ్ క్యారెక్టర్‌గా చేసి ఈ సినిమా చేస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించి కోడి రామకృష్ణ రిలీజ్ చేసిన టీజర్ కర్ణాటక లో ఇప్పుడు ఒక సెన్సేషన్ అయ్యింది. 7 దేశాలకు చెందిన 500 మందికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు 730 రోజుల పాటు శ్రమించి ఈ సినిమాకు ప్రాణప్రతిష్ట చేసారని టాక్.  

ఈ టీజర్లో విష్ణువర్ధన్ లుక్ అద్బుతంగాఉండటంతో ఇప్పడు ఈ సినిమాకు సంబంధించిన వార్తలు దక్షిణ భారత సినిమా రంగంలో హాట్  టాపిక్ గా మారింది. ఒక చనిపోయిన హీరోని తిరిగి గ్రాఫిక్స్ రూపంలో బ్రతికించి సినిమా తీయడం సర్వసాధారణ విషయం కాదు. మరొక ఆశ్చర్యకర విషయం  ఏమిటంటే కోడి రామకృష్ణ చేసిన ఈ ప్రయొగానికి  రాజమౌళి ‘బాహుబలి’  గ్రాఫిక్స్ పై ఖర్చుపెట్టిన మొత్తంలో పావు వంతు కూడ అవ్వలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు రాజమౌళివరకు చేరడంతో మన జక్కన్న కూడ షాక్ అయ్యాడని టాక్.

పీడ కలల వలన చెడు జరుగుతుందా? ఎందుకో తెలుసా?  
మరణించిన వారి ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా?  

కుటుంబ సభ్యుల ముందే సెక్స్ చేసుకునే వింత ఆచారం  

loading...