News and Entertainment

అఖిల్ చైతూ ప్రేమ వ్యవహారాలలో కొత్త మలుపు !


నిన్న ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక అఖిల్ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ను లీక్ చేసి ఒక్కరోజు గడవకుండానే ఈరోజు మరో ప్రముఖ జాతీయ దిన పత్రిక ఏకంగా అక్కినేని అఖిల్ ప్రేమిస్తున్న అమ్మాయి ఫోటోను ప్రముఖంగా తన పత్రికలో ప్రచురించి మరో సంచలనానికి తెర తీసింది. ఆ పత్రిక కథనం ప్రకారం అక్కినేని అఖిల్ ప్రేయసి పేరు శ్రేయ భూపాల్‌.

వీరి ప్రేమ వ్యవహారం పూర్తిగా అక్కినేని కుటుంబానికి తెలుసు అని ఆపత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన శ్రేయ భూపాల్ మంచి ఫ్యాషన్ డిజైనర్ అని తెలుస్తోంది. అంతేకాదు ది అఖిల్- శ్రేయల నిశ్చితార్థం రేపోమాపో జరగవచ్చు అనే ఊహాగానాలను కూడ ఆ పత్రిక బయట పెట్టింది.

ఈ నెల మిస్ అయితే శ్రావణంలో ఎంగేజ్‌మెంట్ ఖాయమని అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలంటున్నాయని ఆ పత్రిక కథనం. ఇది ఇలావుండగా ఇప్పటికే పీకలలోతు ప్రేమలో కూరుకు పోయిన సమంత నాగచైతన్యల ఎంగేజ్ మెంట్ కూడ చైతూ నటించిన ‘ప్రేమమ్’ విడుదల అయ్యాక ఉంటుంది అని అంటున్నారు.

దీనిని బట్టి చూస్తూ ఉంటే ఒకే నెలలో ఈ అన్నదమ్ముల ఎంగేజ్ మెంట్ జరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. బహుశా వచ్చే సంవత్సరం ఈ అన్న దమ్ముల పెళ్ళిళ్ళు కూడ ఒకేసారి జరిగినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే అక్కినేని కుతుబంలో ఒక సంచలనమే అవుతుంది..  
loading...