News and Entertainment

ఉపేంద్ర ‘బ్రహ్మణ’ ట్రైలర్స్ అదుర్స్


తెలుగు, కన్నడంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఉపేంద్ర తాజాగా కొత్త అవతారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివాదాస్పద టైటిల్స్, వివాదాస్పద కాన్సెప్ట్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కన్నడ స్టార్ హీరో తాజాగా  శివంను తెలుగులో బ్రాహ్మణ పేరుతో డబ్ చేస్తున్నారు.  అయితే గతంలో బ్రహ్మణులకు సంబంధించి కొన్ని వివాదాలు సినిమాల్లో చెలరేగడం తో ఈ టైటిల్ పై అప్పుడు కొన్ని ఆంక్షలు మొదలయ్యాయి. వాస్తవానికి ఉపేంద్ర తీసే సినిమాలే చాలా వెరైటీగా ఉంటాయి..ఇక ఆయన పెట్టే టైటిల్స్ మరింత కాంట్రవర్సీగా ఉంటాయి.

ఇప్పటికే లారెన్స్ నటించిన కాంచన చిత్రంలో నటించాడు..ప్రస్తుతం కాంచన 2 (గంగ) చిత్రాలన్నికూడా రిమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా కన్నడ సినిమా శివంను తెలుగులో బ్రాహ్మణ పేరుతో డబ్ చేయడం  ఈ సినిమా టైటిల్ మీద వివాదం మొదలైంది. అయితే ఈ చిత్రం కన్నడంలో కూడా వివాదాల మద్య మొదలైంది. మొదట ఈ చిత్రానికి  బసవణ్ణ పేరు అనుకున్నా కానీ దానికి తీవ్ర వ్యతిరేకత రావడంతో శివం పేరుతో రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధంచిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో ఉపెంద్ర రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడు.


ఓ గుడిలో బ్రాహ్మణుడిగా కనిపిస్తూ.. మరోపక్క మాఫియా డాన్ గా కూడా కనిపిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ సినిమాలోనూ ఉపేంద్ర హీరోయిన్లతో రొమాన్స్ కాసింత ఎక్కువే చేశాడు. అయితే ఈ చిత్రంలో పంచ్ డైలాగ్స్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికి శివుడికి ఒకే బవన్న.. ఇక మీదట ఇద్దరు బసవన్నలు రా.. అనే డైలాగ్ తో సినిమా ట్రైలర్ ముగుస్తుంది.

loading...