News and Entertainment

చిరంజీవి కత్తిలాంటోడు లుక్ పై సెటైర్లు


మెగా అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా షూటింగ్ నిన్న ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే మీడియాకు లీక్ అయిన చిరంజీవి లుక్ ను చూసి మెగా అభిమానులు అంతా జోష్ లోకి వెళ్ళి పోయారు. ఇంత వరకు బాగానే  ఉన్నా చిరంజీవి దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా ? అని అంటూ చిరంజీవిని లుక్ ను చూసి కొందరు  కామెంట్స్ చేసుకున్నట్లు టాక్ .

ఈ కామెంట్స్ ఇలా రావడం వెనుక ఒక కారణం ఉంది.  కొద్ది రోజుల క్రితం ‘మా’ మూవి అవార్డ్స్‌ ఫంక్షన్‌లో కనిపించిన చిరంజీవి కాస్త లావుగా కనిపించాడు. అయితే అనూహ్యంగా ఈఫంక్షన్ జరిగి రెండు వారాలే  అవుతున్నా చిరంజీవి స్లిమ్‌గా కనిపించడం వెనుక ఏమైనా సీక్రెట్ ఉందా అంటూ ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. గతంలో ‘ఠాగూర్‌' సినిమాలో కూడ చిరంజీవి పాటల్లో ఒకలా మిగతా సన్నివేశాల్లో ఇంకొకలా ఉన్న సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ పాటల్లో స్లిమ్‌గా వుండడం కోసం పాటల షూటింగ్‌కి ముందు ప్రత్యేకమైన డైట్‌ ను డైట్ ను చిరంజీవి ఏమైనా ఫాలో అవుతాడా అంటూ గతంలో కూడ సెటైర్లు పడ్డాయి.


ఇప్పుడు అదేవిధంగా ‘మా’ అవార్డ్స్ ఫంక్షన్ లో కనిపించిన చిరంజీవికి ‘కత్తిలాంటోడు’ సెట్స్ పై కనిపించిన చిరంజీవికి చాల తేడా కనిపిస్తూ ఉండటంతో  చిరంజీవి నిజంగానే సన్నబడ్డాడా ? లేదంటే ఏదైనా కెమెరా ట్రిక్ ను ఈ విషయంలో అనుసరించాడా అనే విషయమై చేర్చాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా 'కత్తిలాంటోడు' రెగ్యులర్ షూటింగ్ నిన్న ప్రారంభం అయిన సందర్భంలో సెట్లో హడావిడి చేయవలసిన రామ్ చరణ్ కనిపించక పోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.

ప్రస్తుతం చరణ్ తన ‘ధృవ’ షూటింగ్ కోసం కాశ్మీర్ లో ఉన్న నేపధ్యంలో నిర్మాత అల్లుఅరవింద్ అన్నీ తానై ‘కత్తి లాంటోడు’ సెట్లో హడావిడిగా కనిపించడంతో చరణ్ పేరుకే నిర్మాత పెత్తనం మాత్రం అల్లు అరవింద్ దే అంటూ దే అంటూ ఆ షూటింగ్ స్పాట్ లో సెటైర్లు వేసుకున్నట్లు టాక్..
loading...