News and Entertainment

 వామ్మో...! ఈ అమ్మడు 80 మందితో డేటింగ్..!


అందాన్ని ప‌ణంగా పెట్టి ఓ అమ్మాయి ప్రపంచమంతా ఫ్రీగా డేటింగ్ యాత్ర చేప‌ట్టింది. అదేంటి అనుకుంటున్నారా ఇది నిజ‌మే.. కోరుకున్న‌వ‌న్నీ సొంతం చేసుకుంటూ పైసా ఖర్చు లేకుండా ప్రపంచ యాత్ర చేస్తూ ఉచితంగా షాపింగ్ చేస్తుంది బ్రిటన్ కు చెందిన నటాలి వుడ్.. వివ‌రాల్లోకి వెళితే.. "మిస్ ట్రావెల్" అనే డేటింగ్ వెబ్ సైట్ ద్వారా ఇదంతా సాధ్యమైంది. రెండేళ్ల కిందట నటాలి ఈ వెబ్ సైట్లో అకౌంట్ ఓపెన్ చేసింది. దాని ద్వారా 80 మందిని పరిచయం చేసుకుంది. ఆ 80 మందీ సంపన్నులే. నేను మీ దేశానికి వస్తా.. నీతో గడుపుతా.. ఐతే ప్రయాణం.. వసతి.. షాపింగ్ వగైరా అన్ని ఖర్చులూ నీవే అంటూ ఆఫర్ ఇస్తుంది నటాలి.

ఇలా ఒక్కో మగాడి సాయంతో పైసా ఖర్చు లేకుండా వివిధ దేశాలు చుడుతోంది నటాలి. ఇందుకు బదులుగా తనతో డేటింగ్ చేసేవాళ్లకు సుఖాన్నిస్తోంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆమె ప్రపంచ యాత్ర ఇంకా ముగియలేదు. ఇప్పటికే టర్కీ – అబుదాబి.. దుబాయ్.. కువైట్.. మాల్దీవులు.. ఆస్ట్రేలియా.. చెక్ రిపబ్లిక్ లాంటి దేశాల్లో విహరించిన నటాలి ప్రస్తుతం అమెరికాలోని మియామిలో తన కొత్త డేటింగ్ పార్టనర్ తో కలిసి సరదాగా గడుపుతోంది. ఆమె ప్రతి దేశంలోనూ ఖరీదైన హోటళ్లో ఉంటోంది.

తనకు కావాల్సిందంతా షాపింగ్ చేసుకుంటోంది. ఇలా యాత్రలు చేస్తూ చేస్తూ ఏదో ఒక రోజు తనకు సరిపోయే జీవిత భాగస్వామిని ఎన్నుకుంటానని ఆమె అంటోంది. తనకన్నా వయసులో కాస్త పెద్దవాళ్లతోనే ఇప్పటి వరకు తాను డేటింగ్ చేస్తూ వచ్చానని.. ఇప్పటికి తాను 80 మందితో డేట్లో పాల్గొన్నానని ఆమె వెల్లడించింది.

తనకు సెక్స్ ముఖ్యం కాదని.. కంపెనీ ముఖ్యమని ఆమె అంది. సంపన్న వర్గానికి చెందిన మగాళ్లు.. తనకు ఇట్టే సన్నిహితులవుతున్నారని.. వాళ్లతో సహజంగానే సెక్స్ చేస్తున్నానని ఆమె అంటోంది. తన ఫిగర్ కూడా అందుకు కారణమవుతోందని నటాలి చెప్పింది. తన ఈ ప్రయాణం ఎంత దూరం.. ఎన్ని దేశాల్లో సాగుతుంతో.. తనకు నచ్చినవాడు ఎప్పటికి దొరుకుతాడో.. తన యాత్ర ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేనని నటాలీ అంది.
loading...