News and Entertainment

కొడుకు పెద్దమనిషి ఫంక్షన్ చేసిన తండ్రి (వీడియో)


సాధారణంగా అమ్మాయిలు పెద్దవాళ్లైనప్పుడు హడావుడి, అట్టహాసంగా ఫంక్షన్.. అందరికీ తెలిసిందే. మరి మగ పల్లవాడు పెద్ద మనిషి అయ్యేదెప్పుడు? అయిందన్న సంకేతంగా ఓ ఫంక్షన్ అంటూ లేకుంటే ఎట్టా? ఇదే సంశయం.. ఓ మరాఠీ తండ్రికి కలిగింది. తన కొడుక్కి మూతి మీద గడ్డం, మీసం వచ్చింది కాబట్టి పెద్దవాడు అయినట్టేగా? అని లాజిక్ తీశాడు. మొదటి షేవింగ్ డే ని పురస్కరించుకుని ఓ గ్రాండ్ సెలబ్రేషనే చేశాడు. ఆ విషయం మీడియాకు చేరడంతో దేశవ్యాప్త సంచలనం అయ్యింది. 

థానెలోని ద్వీప్ భగత్ 17వ పుట్టినరోజును ‘షేవింగ్ డే’ గా నిర్వహించారు. మహారాష్ట్ర బోర్డు ఇంటర్ పరీక్షలు ఇటీవలే రాసిన భగత్ పెద్దవాడు అయ్యాడని.. గుర్తుగా అశోక్ సదన్ లో తండ్రి జితేంద్ర భగత్ ఫంక్షన్ నిర్వహించాడు. ఫ్లెక్సీలు కూడా పెట్టాడు. దీనికి దాదాపు 250 మంది అతిథులను ఆహ్వానించాడు. తన కొడుకు ఎదిగాడు అని చెప్పడం చాలా హ్యాపీగా వుందని జితేంద్ర అంటున్నాడు. 

బాబుకి ఎనిమిదేళ్లు వున్నప్పుడే ఫంక్షన్ చేయాలని భావించానని, ఆ ఆలోచనను ఇప్పుడు కార్యరూపం దాల్చిందని చెప్పుకొచ్చాడు. ఇంటర్నెట్ నెట్ పుణ్యామా అని పైసా ఖర్చు లేకుండా ఇలాంటి విషయాలు క్షణాల్లో విశ్వవ్యాప్తం అయిపోతున్నాయి. సో కొత్త ఆలోచన కలిగించిన జితేంద్ర భగత్ ని ఎందరు ఆదర్శంగా తీసుకుంటారో చూడాలి. ఆ న్యూస్ వీడియో మీరూ చూడండి..



లేటెస్ట్ అప్డేట్స్ కోసం FB పేజ్ లైక్ చేయండి


loading...