News and Entertainment

నిజంగానే..కాకులు అరిస్తే చుట్టాలొస్తారా?


మన నిత్యజీవితంలో ఈ మాట చాలా బలంగా పాతుకుపోయింది. కాకులు అదే పనిగా అరుస్తాన్నాయంటే వారి ఇంటికి చుట్టాలు  రాబోతున్నారని ఫిక్స్ అయిపోతారు.  నిజంగానే మన ఇంటికి చుట్టాలు రాబోతున్నరని కాకులకు తెలుసా? అవి అరుస్తున్నాయంటే…ఆ రోజు మనింట్లో బంధువులు వాలిపోతారా? అసలు కాకులకు ఇంత పవర్ ఎక్కడి నుండి వచ్చింది. ? ఇలా అనేక డౌట్స్ మీ మైండ్ ను తెగ తొలిచేస్తున్నాయా? అయితే దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వాస్తవానికి కాకులు అరిస్తే చుట్టాలు వస్తారని అనుకోవడం కేవలం మానవ కల్పితం మాత్రమే. కాకుల అరుపులకు చుట్టాల రాకకు ఏవిధమైన సంబంధం లేదు. ఇక్కడున్న అసలు లాజిక్ ఏంటంటే… కోళ్ల తర్వాత  కాకులు మానవులకు అత్యంత దగ్గరగా ఉండే పక్షులు. ఆకాశంలో స్వేఛ్చగా విహరిస్తుంది కాబట్టి కాకి మన ఇంటికి రాబోతున్న బంధువులను దూరంగా ఉన్నప్పుడే పసిగడుతుందని మన నమ్మకం.



అయితే కాకి మన ఇంటి దగ్గరున్న చెట్టు మీద వాలి అదే పనిగా అరవడం వెనుకున్న ఉద్దేశ్యం… ఆహారం . అవును తిండి కోసమే కాకి అలా అరుస్తుంది. జాగ్రత్తగా గమనించి చూస్తే కాకి ఉదయం నుండి మద్యాహ్నం లోపే ఇలా అరుస్తుంది. ఆ టైమ్ లోనే…గ్రామాలల్లో వంట వండడం, వంటకు సంబంధించిన గిన్నెలను తోమడం లాంటివి చేస్తుంటారు. ఈ టైమ్ లోనే కాకులు  అక్కడుండే మెతుకుల కోసం కాచుకొని చూస్తుంటాయన్న మాట!…  కాకి అదే పనిగా అరుస్తుందంటే, రోజూ గిన్నెలు కడిగే టైమ్ కు ఈ రోజు మీరు ఆపని చేయట్లేదని అర్థం. అందుకే కాకులు మీ పనిని మీకు గుర్తు చేస్తున్నట్టుగా అలా అరుస్తాయట.!

మరో కారణం ఏంటంటే….ఆరుబయట ఏవైనా తినే వస్తువులను ఆరబెట్టినప్పుడు కూడా కాకి అదే పనిగా అరుస్తుంది. దీనికి కారణం….. అక్కడి ఆహారం గురించి ఇతర కాకులకు సమాచారాన్ని అందించడం కోసమే.

ఇక మన పూర్వీకులు కాకుల రూపంలో …..ఉంటారా? అనే విషయంపై సమాచారం కోసం ట్రై చేస్తున్నాం. దొరకగానే…ఆ విషయంలపై కూడా  మరింత క్లారిటీ ఇస్తాం.
మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సినిమా     రియల్ ఫాక్ట్స్     దైవం       హాట్

loading...