News and Entertainment

లిప్ లాక్స్ గురించి ఆసక్తిగా అడిగిన ప్రిన్స్


మహేష్ బాబు హీరోగా వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాక్స్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా హీరోయిన్ గా ప్రిన్స్ మహేష్ హీరోగా ఓ మూవీ రాబోతుంది.

ఈ మూవీకి డైరెక్టర్ గా మురుగదాస్ ఉంటున్నారు. అయితే  ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కథ ఫైనలైజ్ అవ్వటమే కాకుండా, అప్పుడే షెడ్యూల్స్ ని ఫైనలైజ్ చేసుకునే వరకూ వచ్చాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబు సరసన హీరోయిన్ నటిస్తున్న పరిణితీ చోప్ర హీరోయిన్ గా నటిస్తున్నండటంతో, వీరిద్దరి కాంబినేషన్స్ లో కెమిస్ట్రీని వర్కౌట్ అయ్యే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.

ఇద్దరి మధ్య కొన్ని లిప్ లాక్ సీన్స్ పెట్టాలంటూ దర్శకుడు పట్టుబడుతున్నాడు. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ లో పరిణితీ చోప్రకి మంచి మార్కెట్ ఉండటంతో, తనతో లిప్ లాక్ సీన్స్ అయితే బిటౌన్ మార్కెట్ ని సైతం ఆకర్షించవచ్చు అనేది మురుగదాస్ ప్లాన్. ఈ విషయంలో మహేష్ బాబు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారని అంటున్నారు.

రీసెంట్ గా మహేశ్ బాబు, మురుగదాస్ కి ఫోన్ చేసి మరీ లిప్ లాక్స్ సీన్స్ ని మరీ లెన్తీగా కాకుండా షార్ట్ గా ఉండేలా చూడమని చెప్పారంట. దీంతో మురుగదాస్ అందుకు తగ్గట్టుగా సీన్స్ ని డిజైన్ చేశారని అంటున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు.
loading...