News and Entertainment

“అ..ఆ” ని మిస్ చేసుకున్న ప్రిన్స్ మహేష్


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం. అయితే ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టానికి ముందు జరిగిన ఒక స్టోరీ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కెర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన న్యూస్ ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ ని సొంతం చేసుకున్న మూవీ అ..ఆ. అయితే ఈ మూవీలో నిజానికి మహేష్ బాబు నటించాల్సి ఉందని అంటున్నారు. మొదటగా ఈ కథని మహేష్ ని ఉద్ధేశించి త్రివిక్రమ్ డిజైన్ చేసుకున్నాడంట.

కానీ మహేష్ బాబు అప్పటికే బ్రహ్మోత్సవం కథని లాక్ చేయటంతో...త్రివిక్రమ్ మూవీని పక్కన పెట్టేశాడు. మళ్ళీ ఒకానొక దశలో త్రివిక్రమ్ మూవీని మొదటగా చేసి, తరువాత శ్రీకాంత్ అడ్డాల మూవీని చేయాలని ప్రిన్స్ ప్రయత్నించాడంట. కానీ అ...ఆ మూవీ, బ్రహ్మోత్సవం మూవీ రెండు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు కావటంతో...బ్రహ్మోత్సవం మూవీ వైపే ప్రిన్స్ అడుగులు వేశాడు. కానీ బ్రహ్మోత్సవం మూవీ ఫలితాన్ని ఆశించినంతగా ఇవ్వలేకపోయింది.

ఇప్పుడు నితిన్, సమంత కాంబినేషన్ లో వచ్చిన అ..ఆ మూవీ మాత్రం మంచి హిట్ టాక్ ని సొంత చేసుకుంది. అందుకే ప్రిన్స్ అ..ఆ మూవీ సక్సెస్ ని మిస్ చేసుకున్నాడని అంటన్నారు. కొన్ని సందర్భాల్లో టాప్ హీరోలకి ఇటువంటివి జరగటం కామన్ అని అంటున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు మళ్ళీ త్రివిక్రమ్ తో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అయితే అందుకు త్రివిక్రమ్ ఎప్పుడు మళ్ళీ మహేష్ కోసం కథని రెడీ చేసుకుంటాడో అన్నదానిపై సరైన క్లారిటీ లేదని అంటున్నారు. అ..ఆ మూవీ హిట్ అనేది త్రివిక్రమ్ కి మంచి సక్సెస్ ని ఇవ్వటంతో ఇండస్ట్రీ మళ్ళీ త్రివిక్రమ్ వైపు చూస్తుందని అంటున్నారు. 

పవన్ ప్రభాస్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన నదియా 
జి-స్పాట్ అంటే ఏంటి..? ఎక్కడుంటుంది  
కిచెన్ సెక్స్ తో రెచ్చిపోండిలా  
మరణించిన వారి ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా? 
loading...