News and Entertainment

పవన్-త్రివిక్రం ల సినిమా టైటిల్ ఫిక్స్


టాలీవుడ్లో క్రేజీ కాంబో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దే అని కచ్చితంగా చెప్పగలం.. జల్సా, అత్తారింటికి దారేది రెండు సినిమాలు మంచి హిట్ సాధించాయి. అయితే ముచ్చటగా మూడోసారి పవన్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. అయితే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది.

జల్సా, అత్తారింటికి దారేది లానే ఈసారి 'దేవుడే దిగి వచ్చినా' అనే విచిత్రమైన టైటిల్ పెడుతున్నారట. ప్రస్తుతం పవన్ తన సినిమా షూట్లో ఉన్నాడు.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమాకు దర్శకుడిగా డాలి ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు. సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మించిన శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సర్దార్ తర్వాత గ్యాప్ లేకుండా కష్టపడుతున్న పవన్ ప్రస్తుతం చేస్తున్న డాలి సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రంతో సినిమా చేస్తాడట. అనుకున్నట్టుగా కెరియర్లో చక చకా రెండు మూడు సినిమాలు తీసేసి ఇక తాను స్థాపించిన జనసేన పార్టీలో పూర్తి రాజకీయ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు పవన్.

ఇప్పటిదాకా త్రివిక్రం, పవన్ సినిమాల టైటిల్ ఓ విధంగా ఉంటే ఈ దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ కాస్త విచిత్రంగా ఉంది. మరి ఆ టైటిల్ నిజమా కాదా అన్నది కూడా మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. రీసెంట్ గా అ ఆ హిట్ తో త్రివిక్రం మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. మరి రాబోయే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.
loading...