News and Entertainment

సినిమా చాన్స్ కోసం పాడుపని చేసింది..!


జీవితం లగ్జరీగా సాగాలంటే డబ్బు ఉండాలి..మరి డబ్బు రావాలంటే కష్టపడి పనిచేయాలి..లేదా పూర్వికులు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి. కానీ ఈ రెండూ లేకుండా ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలు ఈ మద్య కొంత మంది ఎన్నుకుంటున్నారు. వారు వెళ్లేది అక్రమమార్గమని తెలిసినా అప్పలంగా డబ్బు వస్తుంటే అదే రూట్లో వెళ్తున్నారు. దొరికితే దొంగ..లేదంటే దొర అన్న చందంగా సాగుతుంది. ముఖ్యంగా డబ్బు సంపాదించే క్రమంలో వ్యభిచారం చాలా ఈజీ మార్గమని కొంత మంది అనుకోవడంతో ఈ భాగోతాన్ని రక రకాలుగా వ్యవహరిస్తున్నారు. మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు, అపార్టు మెంట్ లో బ్యాచ్ లర్ రూమ్స్ తీసుకొని హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

కొంత మంది వ్యభిచారం కోసం కొత్త కొత్త టెక్నాలజీ కూడా వాడుతున్నారు.. వీరికోసం కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ చేస్తూ హైటెక్ వ్యభిచారం కొనసాగిస్తున్నారు. తాజాగా పశ్చిమ ముంబైలోని వర్సోవా అనే ప్రాంతంలో ప్రొడక్షన్ హౌజ్ పేరిట ఓ నివాసం ఉంది. అందులో ఓ 24 ఏళ్ల మోడల్ ఉంటోంది.ఆమె సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న మోడల్స్ ను లక్ష్యంగా చేసుకొని వారికి లేనిపోని ఆశలు కలిగించి వ్యభిచార రొంపిలోకి దింపింది. దాంతోపాటు పలువురు మైనర్స్ ను కూడా కొనుగోలు చేస్తూ వారితో ఇలాంటి పాడుపని చేయిస్తోంది. మోడల్స్ ను లక్ష్యంగా చేసుకుని వారిని మాయమాటలతో నమ్మించి.. లేనిపోని ఆశలు కలిగించేది. ఆ తర్వాత పడక సుఖం పంచితేనే సినీ అవకాశాలు వస్తాయని చెప్పి.. వ్యభిచారం రొంపిలోకి దించుతూ వచ్చింది.


ఇందులో పలువురు మైనర్లు కూడా ఉన్నారు.  మొత్తానికి పాపం పండింది..ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో..  ఆమె నివాసంపై ముంబై పోలీసులు రైడింగ్ చేసి ఆమెతో సహా పలువురు యువతులను అరెస్టు చేశారు. అలాగే, ఓ డైరీని కూడా స్వాధీనం చేసుకొన్నారు. అందులో అనేక మంది మోడల్స్, విటుల ఫోన్ నంబర్లు ఉన్నాయి.



loading...