News and Entertainment

మీడియా హైక్ కోసం రాజమౌళి పాట్లు


తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ‘బాహుబలి’ సృష్టి కర్త రాజమౌళి తన ‘బాహుబలి 2’ విషయంలో మీడియా నుండి కొన్ని విచిత్రమైన సమస్యలు ఎదుర్కుంటున్నాడు అన్న గాసిప్పులు వినపడుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం మన తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలు ‘బాహుబలి 2’ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు రాజమౌళికి షాకింగ్ గా మారినట్లు టాక్.

దీనికి కారణం ‘బాహుబలి’ బిగినింగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ షూటింగ్ స్పాట్ చుట్టూ  చైనా గోడలా రాజమౌళి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి ఎవర్ని రాకుండా టాప్ సీక్రెట్ గా ‘బాహుబలి’ బిగినింగ్ షూటింగ్ జరుపుతున్నప్పుడు అప్పట్లో మీడియా వర్గాలు ఎదో విధంగా ‘బాహుబలి’ షూటింగ్ విషయాలను కవర్ చేయడానికి విపరీతమైన ఉత్సాహాన్ని కనపరిచే వారు. అయితే ‘బాహుబలి 2’ షూటింగ్ మొదలు అయి కొన్ని రోజులు అవుతున్నా ఈసారి మీడియా ప్రతినిధులు ‘బాహుబలి 2’ షూటింగ్ జరుగుతున్న రామోజీ ఫిలింసిటీ వైపు పెద్దగా రాకపోవడం రాజమౌళికి షాకింగ్ గా మారింది అని అంటున్నారు.

దీనితో రాజమౌళి తన వ్యూహాన్ని మార్చి ‘బాహుబలి 2’ షూటింగ్ మొదటి రోజున ప్రియమణి వచ్చింది మాహిష్మతి రాజ్యంలో వర్షం కురిసింది ‘బాహుబాలి 2’ షూటింగ్ స్పాట్ కు నేచురల్ స్టార్ వచ్చాడు అంటూ రాజమౌళి స్వయంగా మీడియాకు లీక్ లు ఇస్తూ ‘బాహుబలి 2’ షూటింగ్ నుండి ఈ సినిమాకు హైక్ తీసుకు రావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనితో ‘బాహుబలి 2’ షూటింగ్ చుట్టూ వార్తల కోసం తిరగవలసిన మీడియా తనపని తాను చేయకపోయినా రాజమౌళి ఈ బాధ్యతను కూడ తలకేత్తుకున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి.

‘బాహుబలి 2’ వార్తల గురించి క్రేజ్ పెరిగితే కాని మీడియాలో హైక్ రాదు. మీడియాలో విపరీతమైన హైక్ వస్తే కాని రాజమౌళి ‘బాహుబలి 2’ ను తాను ఆశించిన భారీ రెట్లు వచ్చేలా బిజినెస్ చేయలేదు. ఈ వలయం రాజమౌళికి  బాగా తెలుసు కాబట్టే ‘బాహుబలి 2’ విషయంలో మీడియా హైక్ కోసం తెగ పాట్లు పడి పోతున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి..
loading...