News and Entertainment

పవన్ గొప్ప మనసుని బయటపెట్టిన సత్యానంద్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహాయ గుణం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన ఎంతో మందికి వివిధ రకాలు సహాయం చేసారు. పవన్ ఇంత పెద్ద స్టార్ కావడానికి ఆయన స్టైల్, టాలెంట్ తో పాటు ఆయన మంచి తనం, నిజాయితీ, సహాయ గుణం కూడా ఓ కారణం. పవన్ కళ్యాణ్ తాను చేసిన సహాయం గురించి ఎప్పుడూ ఎక్కడ ప్రకటించుకున్న సందర్భాలే లేవు. 


అయితే సహాయం పొందిన వారు ఏదో ఒక సందర్భంలో ఈ విషయాలను బయట పెడుతుండటంతో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం గురించి గుర్తు చేసుకున్నారు. తన చెల్లి పెళ్లి సమయంలో పవన్ కళ్యాణ్ తన పరిస్థితి చూసి అడగకుండానే సహాయం చేసారని తెలిపారు.

'నా ఫైనాన్షియల్ పరిస్థితి తెలుసుకుని ఓ సారి పవన్ కళ్యాణ్ వెంటనే తనను ఇంటికి రమ్మని కబురు పెట్టారు. వెళ్లగానే రూ. 50 వేలు చేతిలో పెట్టారు(అప్పట్లో ఈ మొత్తం చాలా ఎక్కువే). తర్వాత పెళ్లికి రావడంతో పాటు బ్యాగులో క్యాష్ తెచ్చి అవసరం ఉంటే వాడమని చెప్పారు. ఆయన సహాయం వల్లనే నా చెల్లి పెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది' అని సత్యానంద్ గుర్తు చేసుకున్నారు. 


సినిమాల్లోకి రాక ముందు పవన్ కళ్యాణ్ సత్యానంద్ వద్ద వైజాగ్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుండి తన గురువుతో పవన్ కళ్యాణ్ మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. తర్వాత తన అల్లుడు సాయి ధరమ్ తేజ్, అన్నయ్య కొడుకు వరుణ్ తేజ్ లను కూడా ఆయన వద్దకే శిక్షణకు పంపిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:
రేష్మి చేష్టలకి ఈ మగజాతి ఆణిముత్యం ఎలా రెచ్చిపోయాడో చూడండి 
ఈ భంగుమల్లో సెక్స్ చేస్తే అమ్మాయిలకి ఇష్టమట 
కొడుకు పెద్దమనిషి ఫంక్షన్ చేసిన తండ్రి (వీడియో) 
పవన్-చరణ్-త్రివిక్రం కాంబినేషన్ లో సినిమా  

loading...