News and Entertainment

ON/ OFF (పవర్ బటన్) సింబల్ ఇలాగే ఎందుకుంటుందో తెలుసా?


మొబైల్ ఫోన్, టివి, ల్యాప్ టాప్, వాషింగ్ మెషిన్….ఇలా ఏ  ఎలక్ట్రికల్ వస్తువులనైనా ఓ సారి పరిశీలించండి. వాటి పవర్ బటన్ సింబల్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. ఎందుకు అలా అంటే… దీని వెనుక ఓ  అర్థవంతమైన లాజిక్ ఉంది. ఇప్పుడు మనం దానిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ప్రతి వస్తువు పేరు వెనుక, ప్రతి ఎలక్ట్రికల్ సింబల్ వెనుక ఓ లాజిక్ ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే..ఓస్ ఇంతేనా..అని అనుకుంటాం.  ఈ పవర్ బటన్ వెనుక ఉన్న లాజిక్ కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది, కానీ మనలో చాలా మందికి ON/OFF బటన్స్ మీద ఈ సింబలే ఎందుకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ లాజిక్ ను తెలసుకుందాం.

ఛలో…ఫస్ట్..పవర్ బటన్ సింబల్ ను ఓ సారి కన్నుల నిండుగా చూసుకుందాం..


ఈ సింబలే కదా..ప్రతి పవర్ బటన్ కు ఉంటేది. ఇలాగే ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం…ఓ సారి పై సింబల్ ను జాగ్రత్తగా పరిశీలించండి. ఓ సర్కిల్ లోకి ఓ లైన్ ను ఇరికించినట్టుంది కదా… వాటిని వేరు వేరుగా చూస్తే..అవి: O,I లు.


ఇప్పుడు ఇంకాస్త డెప్త్ గా వెళదాం.. అవి  1,0 లు… రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఇంజనీర్లు తమ ఎలక్ట్రిక్ వస్తువులకు ఈ సింబల్ ను సూచించారు. ఎందుకు 1,0 లు మిళితమైన ఈ సింబల్ ను చూపించారంటే….  కంప్యూటర్ బేసిక్ గా బైనరీ కోడ్ మీద నడిచేది. అంటే.. ప్రతి సమాచారాన్ని 0,1 ల రూపంలో సేవ్ చేసుకునేది. దీనిని బట్టి లాజిక్ గేట్ ల నిర్మాణం ఉండేది.

అంటే  1 అంటే ఆన్….0 అంటే ఆఫ్ అని అర్థం.
ఆన్ అండ్ ఆఫ్ కు అదే బటన్ ను యూజ్ చేస్తాము కాబట్టి. 1,0 అను అంకెలు మిళితమై ఉంటాయన్న మాట.


చివరగా 1973 లో ఇంటర్నేషనల్ ఎలెక్ట్రో టెక్నికల్ కమీషన్ ( IEC)  ఈ పవర్ బటన్ సింబల్ ను ఆమోదించింది.
ఇప్పటికి చాలా దేశాల్లోని స్విచ్ ల మీద 0,1 నెంబర్స్ ఉంటాయ్.. మన దగ్గర On/Off లాగా..

ఇదిగో ఇదన్నమాట ….పవర్ బటన్ వెనుక ఉన్న అసలైన లాజిక్.
మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సినిమా     రియల్ ఫాక్ట్స్     దైవం       హాట్

loading...