News and Entertainment

కలాం హెయిర్ స్టైల్ కు కారణాలు ?APJ గురించి మీకు తెలియని 12 విషయాలు!


ఇండియన్ మిసైల్ మాన్.. అబ్దుల్ కలాం, తన కలలు కన్న విజన్ ఇండియా 2020 ని చూడక ముందే ఈ లోకాన్ని వదిలి అనంతలోకాలకు పయనం అయ్యారు APJ గారు . పేపర్ భాయ్ నుండి ప్రెసిడెంట్ వరకు కలాం చేసిన మహాప్రస్థానం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది, ఆయన చరిత్ర మనందరినీ సగర్వంగా తలెత్తుకొని వి ఆర్ ఇండియన్స్ అని చెప్పుకునే బలాన్నిచ్చింది. కలాం జీవిత లోతుల్లోకి వెళితే.. మనకు తెలియని చాలా విషయాలు బోధపడతాయి. అదర్శాలకు నిలువెత్తు రూపం అబ్దుల్ కలాం.


 • ఇప్పుడు ఆయన గురించి అంతగా తెలియని 12 విషయాలను తెలుసుకుందాం.
 • చదువుకునే రోజుల్లో కలాంజీ ..పేపర్ భాయ్ గా ఉదయాన్నే పేపర్ వేసేవారు. అయితే పేపర్ వేయడంకంటే ముందు ఆ పేపర్ మొత్తాన్ని రెండు సార్లు క్షుణ్ణంగా చదివేవారు. ఆరేళ్ల ప్రాయం నుండి వార్తా పత్రికలు చదవడం ఆయనకు అలవాటుగా మారింది.
 • ఇప్పుడు మన దేశంలో ప్రచారంలో ఉన్న కొటేషన్లలో అబ్దుల్ కలాం కొటేషన్లు రెండవ స్థానంలో ఉన్నాయి. మొదటి స్థానంలో వివేకానంద కొట్స్ ఉన్నాయ్.
 • పుట్టుక తోనే అబ్దుల్ కలాం కు ఓ చెవి సగం మూతబడి ఉంది, స్కూల్లో దీనిపై ఎగతాళి కూడా చేసేవారంట సహచర పిల్లలు. అందుకే కలాం హేయిర్ స్టైల్ అలా సెట్ చేసుకున్నారు. చెవులను పూర్తిగా కప్పేసేలా..
 • ఎక్కడ వెతికినా, ఎంత వెతికినా.. కోపంతో ఉన్న కలాం ఇమేజ్ మీకు దొరకదు, ఉండదు. ఎందుకంటే ఆయనకు కోపం అంటే తెలియదు.
 • ఆయన సబ్జెక్ట్ ఫిజిక్స్ ఆయినప్పటికీ పర్సనాలిటీ డెవలంప్మెంట్ మీద ఇచ్చిన లెక్చర్సే ఎక్కువ.
 • తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన ఇంటిని. మ్యూజియంగా మార్చేసి, దానిని తమిళనాడు గవర్నమెంట్ కు ఇచ్చేశాడు.
 • తన సంపాదనంతా .. పురా( గ్రామాలను పురపాలక స్టాయిలో తీర్చిదిద్దే పథకం) కోసం ఓ ట్రస్ట్ కు ఇచ్చేవాడు. మరో విషయం ఏంటంటే ఈ స్కీమ్ ను స్టార్ట్ చేసింది కూడా ఆయనే.
 • APJ కు హైద్రాబాద్ అంటే అమితమైన ఇష్టం.. ఇక్కడి L.V ప్రసాద్ హాస్పిటల్ అన్నా, నిమ్స్ హాస్పటల్ అన్నా అమితమైన ఇష్టాన్ని వ్యక్తం చేసేవారు.
 • సైంటిస్ట్ గా మొదటి క్షిపణి ని తయారు చేసిన కలాం. అంగ వైకల్యం గల వారికి జైపూర్ ఫూట్ కంటే తేలికైన కాలిఫర్స్ ఐడియాను ఇవ్వడమే కాకుండా, దగ్గరుండి మరీ తయారు చేయించారు.
 • కలాం కు ఏదైనా ప్రశ్నను తన మెయిల్ పంపితే ..24 గంటల్లో రిప్లే ఇచ్చేవారు.
 • ఏ దేశ రాష్ట్రపతి రాయనన్ని బుక్స్ రాసిన ఘనత కూడా ఈయనదే. ఒక్క వింగ్స్ ఆఫ్ పైర్ అనే కలాం రాసిన బుక్ 13 భాషల్లోకి తర్జుమా చేశారు.
 • కలాం ప్యూర్ వెజ్ టేరియన్.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...


వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...