News and Entertainment

చిరంజీవి 150వ సినిమాలో 20 పంచ్ డైలాగ్స్!


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ కత్తిలాంటోడు. ఈ కత్తిలాంటోడు టైటిల్ అనేది ప్రచారంలో ఉన్నది మాత్రమే అని స్వయంగా నిర్మాత అయిన రామ్ చరణ్ వెల్లడించారు. అయితే ఈ మూవీకి ఓ ఆసక్తికరమైన టైటిల్ ని చిత్ర యూనిట్ ఇప్పటికే ఆలోచించింది. త్వరలోనే ఆ టైటిల్ ని రామ్ చరణ్ అనౌన్స్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే,మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ లో పంచ్ డైలాగ్స్ కి కొదవేలేదని అంటున్నారు. అభిమానులు ఏ విధంగా చిరంజీవి మూవీని ఊహిస్తున్నారో, అదే విధంగా అభిమానుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా చిరు మూవీని డైరెక్టర్ వినాయక్ రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో చిరు చెప్పిన డైలాగ్స్,తన డ్యాన్స్ హైలెట్ గా నిలిచాయి.


ఇప్పుడు కూడ తను రీ ఎంట్రీ ఇస్తున్న 150వ సినిమాలో డైలాగ్స్ అధిరిపోయేలా ఉంటాయని అంటున్నారు. తమిళ వర్షన్ లో కత్తి మూవీ ఏం రేంజ్ లో హిట్ అయిందో...ఆ స్థాయికి మించి ఇక్కడ హిట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ మూవీలో రైతులను, అభిమానులని ఉద్ధేశించి మెగాస్టార్ చిరంజీవి దాదాపు 20కి మించిన డైలాగ్స్ ని చెబురంట.

ప్రతి డైలాగ్ ఎంతో ఇన్స్ఫిరేషన్ గా ఉంటుందని చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న సమాచారం. పరుచూరి బ్రదర్స్, ఆకుల శివ, బుర్రా సాయి మాధవ్ వంటి రచయితలు ఈ డైలాగ్స్ ని సమకూర్చారు. ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ రెడీ చేసిన డైలాగ్స్ సినిమాకే హైలెట్ కానున్నాయని అంటున్నారు. చిరంజీవి చెప్పే ఈ భారీ డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పించటం ఖాయం అని అంటున్నారు.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...