News and Entertainment

6వ తరగతి అబ్బాయి, అమ్మాయి ప్రేమ అంటూ లేచిపోయారు..!


టెక్నాలజీ పెరిగిపోయింది, దాంతో పాటు యువతరం ఆలోచనలు మారుతున్నాయి. యవతతో పాటు చిన్న పిల్లలు కూడా మారిపోతున్నారు. అన్నీ కూడా మారుతున్నాయి. ప్రేమ, పెళ్లి విషయాలు కూడా మారుతున్నాయి. కొన్ని సంవత్సరాల ముందు వరకు యవ్వనంలోకి వచ్చిన తర్వాతే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే వారు. కాని ఇప్పుడు మాత్రం చిన్న పిల్లలే ప్రేమ అంటూ ఉన్నారు. సినిమాలు, టీవీ ప్రభావం వల్ల చిన్న పిల్లల్లో పెద్ద పెద్ద ఆలోచనలు కలుగుతున్నాయి. కొన్ని సంఘటనలు వింటుంటూ, చూస్తుంటే చిత్రంగా అనిపిస్తున్నాయి. ఇలాంటి చిత్రమైన సంఘటనే గుజరాత్‌లో జరిగింది. 6వ తరగతి చదువుతున్న అబ్బాయి, అమ్మాయిలు ప్రేమించుకుని, లేచి పోయారు.

రోజూ లాగే స్కూల్‌కు వెళ్లిన ఆ అబ్బాయి మరియు అమ్మాయి సాయంత్రం స్కూల్‌ సమయం ముగిచి రెండు మూడు గంటలు అయినా కూడా ఇంటికి తిరిగా రాలేదు. మూడు గంటలు చూసిన తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మరియు అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా విడి విడిగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయి వద్ద ఫోన్‌ ఉందని విషయం తెలిసిన పోలీసులు ఆ ఫోన్‌ను ట్రేస్‌ చేయాలని ప్రయత్నించారు. మొదట ఆ ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆ తర్వాత గంటకు ఆ ఫోన్‌ ఆన్‌ అయ్యింది. ఆ ఫోన్‌ను వెంటనే ట్రేస్‌ చేశారు.

ఫోన్‌ ట్రేస్‌ చేసి ఆ పిల్లల జాడను పోలీసులు తెలుసుకున్నారు. ఆ పిల్లలను పోలీసులు తీసుకు వచ్చి ప్రశ్నించగా, ఆశ్చర్యకంగా సమాధానం చెప్పారు. తాము ప్రేమించుకున్నాం అని, తమ ప్రేమను ఇంట్లో వారు ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో లేచి పోయాం అన్నారు. మాకు ఏదైనా ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం. కాని ఎవరు కూడా ఇల్లు అద్దెకు ఇవ్వలేదు. దాంతో తన వద్ద ఉన్న ఫోన్‌ను ఆన్‌ చేసి స్నేహితుడికి ఇంటి కోసం రూం కోసం కాల్‌ చేశాం అని ఆ కుర్రాడు చెప్పాడు. ఆ మాటలు విన్న పోలీసులు వెంటనే ఒక్కొక్కరు లీటరు నీళ్లు తాగారు. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ వయస్సులో ప్రేమ వద్దని వారిని చెప్పి, వారి తల్లిదండ్రులకు సైతం కొన్ని మంచి మాటలు చెప్పి పంపించారు.