News and Entertainment

కారు దిగింది..పులి తినేసింది(లైవ్ వీడియో)


కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తోంది ఓ మహిళ. కారు ఆపి డ్రైవింగ్ చేసే వైపు నుంచి మారడానికి దిగి మరో డోర్ తెరిచింది అంతే ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది. ఆ మహిళను పులి వచ్చి ఎత్తుకెళ్లి చంపి తినేసింది. కాపాడేందుకు వెళ్లిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్ పబ్లిష్ చేసింది. అయితే వారి వివరాలేమీ తెలియరాలేదు.

చైనా రాజధాని బీజింగ్ యాంక్వింగ్ జిల్లా గ్రేట్ వాల్‌‌కు సమీపంలోని సఫారీ పార్క్ దగ్గర ఈ ఘటన జరిగింది. కాగా ఆ మహిళ కారు ఆపిన ప్రదేశం వన్యప్రాణులుండే ప్రదేశం. అయితే చుట్టుపక్కలా కార్లున్నాయి..తిరుగుతున్నాయి. పార్క్ నుంచి చిరుత ఎలా తప్పించుకుందన్న విషయం అక్కడి పార్క్ సిబ్బంది, అధికారులు ఆరా తీస్తున్నారు.


మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...
టాప్ స్టోరీస్ చదవండి:

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...