News and Entertainment

తెల్లచీర కట్టుకుని లిఫ్ట్ అడిగిన అమ్మాయి మాయమైందట !


ఈ ప్రపంచంలో ప్రతివారికి ఓ అభిరుచి ఉంటుంది. కొంతమంది దైవభక్తిలో మునిగితేలితే, మరికొందరు మాత్రం దేవుడే లేడంటారు. దెయ్యాల భయంతో కొందరు గజగజలాడిపోతుంటారు. ఇంకొందరు దెయ్యాలే లేవంటారు. దేవుడిని చూశారో లేదో తెలియదు కానీ దెయ్యాలను చూశామనే వారి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. ఇండియాలో ఇలాంటి భయంకర ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దెయ్యాలంటే ఆసక్తి, వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నవారు అలాంటి ప్రదేశాలు చూడాలని తహతహలాడుతుంటారు. అలాంటి ప్రాంతాల్లో గడిపిన కొంతమంది అనుభవాల ఆధారంగా వాటి గురించి వివరిస్తున్నాం. ఈ వివరాలు కేవలం ఆ ప్రదేశాలను సందర్శించిన వారి వ్యక్తిగత అనుభవాలు మాత్రమే.

 1. జిపి బ్లాక్(మీరట్): ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్న జిపి బ్లాక్‌ను అత్యంత భయంకర ప్రదేశంగా చెప్పుకుంటారు. ఈ బంగ్లాలో నలుగురు కుర్రాళ్లు క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ కనిపించారని, కానీ దగ్గరకెళితే సడన్‌గా మాయమవుతారని ఈ బంగ్లాను చూడటానికి వెళ్లిన చాలామంది చెబుతుంటారు. అంతేకాదు, కొంతమంది అమ్మాయిలు రెడ్ డ్రస్ ధరించి బంగ్లా నుంచి బయటకు వెళ్లడం చూశామని అంటున్నారు.



2. ఢిల్లీ కంట్(ఢిల్లీ): దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఓ భయంకర ప్రదేశం ఉందంట. ఢిల్లీ కంట్ అనే ప్రాంతం పచ్చని చెట్లతో అడవిని తలపిస్తుంటుంది. ఈ పచ్చని చెట్ల మధ్య రోడ్డు ఉంది. ఈ రోడ్డుపై రోజూ కొన్ని వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఈ రోడ్డులో ఓ మహిళ తెల్ల చీర కట్టుకుని వచ్చే పోయే వాళ్లను లిఫ్ట్ అడుగుతూ ఉంటుందని, కారు ఆపకపోతే అంతకన్నా వేగంతో వచ్చి కారులో కూర్చుంటుందని ఇటుగా వెళ్లిన వారు చెప్పారు. ఇప్పటికీ ఇలాంటి అనుభవం కావాలనుకుంటే ఈ ప్రాంతానికి వెళ్లాలని వారు సూచిస్తుండటం విశేషం.

3. వనివర్వదా కోట(పూణె): పూణెలో ఉన్న ఈ కోటకు కూడా దెయ్యాల ఫ్లాష్‌బ్యాక్ ఉంది. ఈ కోటలో యువరాణి దెయ్యమై తిరుగుతుందని, రాత్రిపూట ఆమె అరుపులతో కోట దద్ధరిల్లుతుందని ఇక్కడి వారు కథలుకథలుగా చెప్పుకుంటారు. ఆ భయంతో రాత్రయితే కోట వైపు వెళ్లాలంటేనే ఇక్కడి వారు భయపడతారు.



4.వ్రిద్వాన్ సొసైటీ(థానే): ఇది థానేలోని ఓ పెద్ద భవన సముదాయం. ఈ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెం.66బిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, అప్పటి నుంచి రాత్రయితే ఎవరో తిరుగుతున్నట్టుగా ఉంటుందని సెక్యురిటీగార్డులు చెబుతున్నారు. ఒక సెక్యురిటీగార్డ్ చైర్‌లో కూర్చుని నిద్రపోతుండగా అతనిని ఎవరో లాగిపెట్టి కొట్టారని, దీంతో అతను వేరే గార్డును కొట్టాడని చెబుతుంటారు.


ఆమె వాక్కు బ్రహ్మంగారి వాక్కు అమెరికాకు ఆఖరి అధ్యక్షుడు ఒబామా తర్వాత అమెరికా అంతమైపొతుంది


వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...