News and Entertainment

TV రిమోట్లతో…కరెంట్ మీటర్లను OFF చేస్తున్నారట! కరెంట్ బిల్ తగ్గించుకోడానికి కొత్త టెక్నిక్.!?


కరెంట్ వాడిన దానిని బట్టి  మీటర్ తిరుగుతుంది. మీటర్ రీడింగ్ ను బట్టి కరెంట్ బిల్ ను వేస్తారు. ఇది కరెంట్ బిల్ ను జమా కట్టే పద్దతి. అక్కడక్కడ కొంత మంది కరెంట్ బిల్ ను కొంత  తగ్గించుకునేందుకు అడ్డదారి ప్రయత్నాలు చేస్తుంటారు. తమకు తెలిసిన టెక్నిక్స్ ద్వారా మీటర్ ను తిరగకుండా ఆపుతుంటారు …తద్వారా కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది.  జనాలు ఇలా తెలివిమీరారు అనే ఉద్దేశ్యంతోనే కరెంట్ సంస్థ పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను మంజూరు చేసింది. మీటర్ అంతా సీల్ చేసి మరీ ఇంట్లో ఫిక్స్ చేసి ఇచ్చింది. దీనిని టాంపరింగ్ చేయడానికి వీలు లేని విధంగా రూపొందించింది.


ఇదిలా ఉంటే….ఇప్పుడు ఆ మీటర్లనే…TV రిమోట్ తో ఆన్/ ఆప్ చేస్తున్నారట  వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు వినియోగదారులు.  కొత్త మీటర్లు….తప్పుడు రీడింగ్స్ వల్ల బిల్ ఎక్కువగా వస్తుందని చాలా మంది వినియోగదారులు కంప్లైట్ చేసినా సదరు విద్యుత్ సంస్థ పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన కొందరు వినియోగదారులు టీవీ రిమోట్‌తో మీటర్ల నియంత్రణ మొదలు పెట్టారట! సాఫ్ట్‌వేర్‌లో సాంకేతికలోపం వల్లే అలా జరుగుతోందన్న అధికారులు మీటర్లు మార్చాలని నిర్ణయించారట.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...