News and Entertainment

'ఖైదీ నంబర్ 150' గా చిరంజీవి


మెగా స్టార్ చిరంజీవి మైలురాయి 150 వ చిత్రం టైటిల్ 'కత్తిలాంటోడు' సినిమా టైటిల్ మారుస్తున్నారన్న  వార్తలు తాజా నివేదికల ప్రకారం వినిపిస్తున్నాయి. 'ఖైది నంబర్ 150' గా పేరు మార్చనున్నారని, తమిళ సూపర్ హిట్ 'కత్తి' తెలుగు రీమేక్ లో ద్విపాత్రాభినయం లో ఒకటి దొంగ,ఇంకోరు రైతుల రక్షకునిగా చిరు పాత్రలు వుండనున్నాయి.ఇప్పటికే జైలులో చిరంజీవితో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారు.అయితే ఈ సినిమాకు చిరంజీవి క్లాసిక్ చిత్రం 'ఖైది' పేరునే పెట్టాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నారు.


ఇదిలా ఉండగా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ కోసం వేట ఇంకా పూర్తి కాలేదు. హీరోయిన్ ఎంపిక విషయం చిరంజీవి పూర్తిగా నిర్మాత రాంచరణ్,దర్శకుడు వివి వినాయక్ కే వదిలేసినట్టు సమాచారం. నయనతార నుంచి కాజల్ అగర్వాల్ వరకు ఎన్నో పేర్లు పరిశీలన లోకి వచ్చినా ఇంతవరకు ఎవరు ఖరారు కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  శరవేగంగా జరుపుకుంటోంది. రెండో షెడ్యుల్ లో రైతులకు సంబందించిన సన్నివేశాలు హైదరాబాద్ శివార్లలోని చేవెళ్ళ ప్రాంతం లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...